https://oktelugu.com/

AP Employees: వాళ్లతో ‘పంచాయితీ’.. జగన్ కు మంచిది కాదా?

AP Employees: గోటితో పోయేదన్నీ ఏపీ సర్కార్ గొడ్డళ్ల దాకా తెచ్చుకుంటుందా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అనవసరంగా ఉద్యోగులతో పంచాయితీ పెట్టుకుంటూ అసలుకే ఎసరు తెచ్చుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిందంటే ఉద్యోగుల పాత్ర కూడా ఘననీయంగా ఉంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జగన్ పాదయాత్రలో భాగంగా ఉద్యోగులకు అనేక వాగ్దానాలు చేశారు. పీఆర్సీ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 2, 2021 3:16 pm
    Follow us on

    AP Employees: గోటితో పోయేదన్నీ ఏపీ సర్కార్ గొడ్డళ్ల దాకా తెచ్చుకుంటుందా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అనవసరంగా ఉద్యోగులతో పంచాయితీ పెట్టుకుంటూ అసలుకే ఎసరు తెచ్చుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిందంటే ఉద్యోగుల పాత్ర కూడా ఘననీయంగా ఉంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

    AP Employees

    AP CM

    జగన్ పాదయాత్రలో భాగంగా ఉద్యోగులకు అనేక వాగ్దానాలు చేశారు. పీఆర్సీ అమలు చేస్తామని, ఉద్యోగుల ప్రమోషన్లు, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని, డీఏ, హెచ్ఆర్ఏ పెంచుతామని తదితర హామీలన్నీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఉద్యోగుల పీఆర్సీపై ప్రభుత్వం ఏటు తేల్చడం లేదు. కనీసం పీఆర్సీ నివేదికను కూడా ఉద్యోగులకు చూపించకపోవడంతో వారంతా పోరుబాటకు సిద్ధమయ్యారు. పలుమార్లు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరకలేదు.

    దీంతో ప్రభుత్వంలోని పలువురి పెద్దలతో ఉద్యోగ సంఘాల నాయకులు భేటి అయి సమస్యలపై చర్చించారు. అయితే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాలేదని తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే నిన్న ఉద్యోగుల సంఘం నేతలు చీఫ్ సెక్రటరీతో భేటి అయి ఈనెల 7నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు నోటీసులు ఇచ్చారు. లాంగ్ పెండింగ్ డిమాండ్ల సాధన కోసం తామంతా సమ్మె చేయనున్నట్లు ఉద్యోగులంతా స్పష్టం చేస్తున్నారు.

    కాగా పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఉద్యోగులకు ఎందుకు చూపించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఉద్యోగ సంఘాల నేతలకు పీఆర్సీ నివేదిక అందజేయడం అనేది కామన్. ఆ నివేదిక ఆధారంగా ఆ సంఘం నేతలు ప్రభుత్వం చర్చలు జరిపి తమకు కావాల్సిన ఫిట్మెంట్ ను కోరుతుంటారు. చంద్రబాబు హయాంలోనూ ఇలానే జరిగింది. ఆ సమయంలోనే ఉద్యోగులకు భారీగా జీతాలను పెంచారు.

    Also Read: ఏపీలో కమ్మ సామాజిక వర్గం ఒకటవుతుందా?

    అయితే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండటంతో అందులో సగం కూడా ఫిట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయడం లేదని ఉద్యోగ సంఘాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో తమతో చర్చిస్తే సమస్యలకు ఓ పరిష్కారం వస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు.

    అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఉద్యోగులతో మాట్లాడటానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ కారణంగానే ఉద్యోగులు ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం జగన్ అవనసరంగా ఉద్యోగులతో పంచాయతీ పెట్టుకొని తప్పు చేస్తున్నారనే టాక్ విన్పిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల సమస్య మరింత జఠిలం కాకముందే వారిని పిలిచి మాట్లాడుతారే లేదో వేచిచూడాల్సిందే..!

    Also Read: సీఎం జగన్ విజ్ఞప్తిని ఆ తల్లులు పట్టించుకుంటారా?