Operation Kagar: దండకారణ్యంలో మావోయిస్టులను పూర్తిగా లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా ఆపరేషన్ కగార్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే మావోయిస్టులపై యుద్ధం ప్రకటించింది. దండకారణ్యం విస్తరించిన రాష్ట్రాలలో మావోయిస్టులను ఏరి పారేస్తోంది. ఇప్పటికే మావోయిస్టులలో కీలక నాయకులు మొత్తం లొంగిపోయారు. మిగతా మంది కూడా అదే బాటలో ఉన్నారు.
మావోయిస్టులు లొంగిపోతున్నారని కేంద్ర బలగాలు ఆగిపోవడం లేదు. పలు రాష్ట్రాల సహకారంతో దండకారణ్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నాయి. మావోయిస్టుల ఉనికి లేకుండా ఏరి పారేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా హతమయ్యాడు. అతని భార్య, మరో ఆరుగురు మావోయిస్టులు చెడిపోయాడు.. హిడ్మా కోసం అనేక రాష్ట్రాల పోలీసులు చాలా కాలంగా వెతుకుతున్నారు. అయితే ప్రస్తుతమితడు మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం లో కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. హిడ్మా మావోయిస్టు పార్టీలో కీలకంగా కొనసాగుతున్నాడు. అనేక ఎన్కౌంటర్లలో అతడు కీలక సభ్యుడు. మందు గుండు సామగ్రిని పేల్చడంలో అతడు సిద్ధహస్తుడు. అనేక రాష్ట్రాలలో అతడు ఎన్కౌంటర్లలో కీలక పాత్ర పోషించాడు.
హిడ్మా మీద భారీగా రివార్డు ఉంది. అతని మీద అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మావోయిస్టులు లొంగిపోతున్నప్పటికీ.. హిడ్మా మాత్రం లొంగిపోలేదు. పైగా యాక్షన్ టీం తో కలిసి అతడు కార్యకలాపాలు సాగిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో కొంతకాలంగా అతని కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు.. చివరికి విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా అతడు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.
మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో గాలింపు చేపడుతున్న పోలీసులకు మావోయిస్టు దళాలు తారసపడ్డాయి. దీంతో ఇరుపక్షాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా కన్నుమూశాడు. అతడి భార్యతో పాటు ఇంకా నలుగురు మావోయిస్టులు కన్నుమూసినట్టు తెలుస్తోంది.. ఇప్పటికే సరైన కార్యవర్గం లేకుండా డీలా పడిపోయిన మావోయిస్టులకు హిడ్మా మరణం కోలుకోలేని దెబ్బ అని తెలుస్తోంది.. హిడ్మా మరణానికి సంబంధించి పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.