NTR : నందమూరి తారక రామారావు.. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. వెండితెర రారాజుగా వెలుగొందారు. రాజకీయ రంగంలో మకుటంలేని మహారాజుగా ఎదిగారు. ఆయన ప్రతీ అడుగు సంచలనమే. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చినా అదే పరంపర. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి రావడం అంటే ఆషామాషీ కాదు. కానీ తిరుగులేని మెజార్టీతో రాజకీయాల్లో ఎన్టీఆర్ తనను తాను నిరూపించుకున్నాడు. అంతే కాదు అటు సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఇప్పటికీ ఒక రోల్ మోడల్ గా ఎన్టీఆర్ నిలిచిపోతారు. అటువంటి మహోన్నత నేత ఎన్టీఆర్ చివరి రోజుల్లో రాజకీయంగా ఎంతో క్షోభ అనుభవించారు. ఎవరినైతే నమ్ముకున్నారో వారి చేతుల్లోనే వెన్నుపోటుకి గురయ్యారు. మానసిక క్షోభతోనే ప్రాణాలు విడిచారు.
ఎన్టీఆర్ వెన్నుపోటుకు ఆధ్యుడెవరు? అంటే అందరి వేళ్లు చూపించేది చంద్రబాబు వైపే. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని ఇప్పటికీ ప్రత్యర్థులు చటుక్కున విమర్శిస్తుంటారు. అది విమర్శతో పాటు అపఖ్యాతి కూడా. ఆ మచ్చ ఎన్ని మందులు రాసినా పోయేది కాదు. ఏడు పదుల వయసులో కూడా ఆ మచ్చ చెరుపుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నమంటూ లేదు. నాటి పరిస్థితిని గుర్తుచేసుకొని కన్నీరుపెట్టుకున్నా, ఎన్టీఆర్ నామస్మరణ చేసినా జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోలేకపోయారు. అయితే ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు మాత్రమేనా ..? ఇంకెవరూ లేరా ? అంటే చాలామంది పేర్లే బయటకి వస్తాయి. కాకపోతే వారంతా తెర వెనుక పాత్రదారులుగా ఉండడడం, తెర ముందు చంద్రబాబు ఒక్కడే ఉండడంతో ఆయన ఒక్కడి పేరే వెన్నుపోటు రాజకీయంలో మార్మోగిపోయింది.
వెన్నుపోటు ఎపిసోడ్ లో చంద్రబాబుది యాక్టివ్ రోల్. కానీ తెరవెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎంతో మంది ఉన్నారు. రామోజీరావు, రాధాక్రిష్ణ..ఇలా ఒకరా? ఇద్దరా? అందరూ వెన్నుపోటకు ఇతోధికంగా సాయం చేసినవారే. తనకు వెన్నుపోటు పొడుస్తారు అనే విషయం ఎన్టీఆర్ కు పొడిపించుకునే వరకు తెలియనే తెలియదు. తెలుసుకునే లోపు సీఎం కుర్చీ తన అల్లుడు చంద్రబాబు చేతికి వెళ్ళిపోయింది. అప్పటి వరకు తాను కనిపిస్తే పూల వర్షం కురిపిస్తూ, వంగి వంగి నమస్కారాలు పెట్టిన వారంతా ఒక్కసారిగా తనపై చెప్పులు వేయడం ఎన్టీఆర్ తట్టుకోలేకపోయారు. నమ్మి పిల్లని ఇచ్చినందుకు తనకు తగిన శాస్తి చేశాడని ఎన్టీఆర్ కుమిలిపోయారు. మనస్తాపంతో మంచం పట్టారు. భాధతోనే తనువు చాలించారు.
అయితే ఇదంతా ఒక ఎత్తు.. కుటుంబసభ్యులు మరో ఎత్తు అన్నట్టు.. వారి మోసానికే ఎన్టీఆర్ ఎక్కువగా క్షోభకు గురయ్యారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందడం సాధరణం. అయితే దానినే అడ్వాంటేజ్ గా తీసుకున్న చంద్రబాబు.హరికృష్ణ, బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ని కూడా ప్రలోభ పెట్టడం, లక్ష్మీపార్వతి కి వ్యతిరేకంగా ఇదంతా చేస్తున్నామని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను నమ్మించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా పావులు కదిపించడంలో సక్సెస్ అయ్యారు. అటు పార్టీని, ఇటు కుటుంబసభ్యులను ఒకేసారి హ్యాండ్ వర్ లోకి తెచ్చుకోవడానికి సాయం చేసింది మాత్రం ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాక్రిష్ణలు. ఇలా అందరి సహకారంతో వెన్నుపోడు ఎపిసోడ్ నడిపించేసరికి ఎన్టీఆర్ తట్టుకోలేకపోయారు. ప్రతిఘటించడానికి ప్రయత్నించినా ఏ మార్గాన్ని చంద్రబాబు విడిచిపెట్టలేదు. అందుకే మనస్తాపానికి గురయ్యారు.మనోవ్యధతో అక్కడకు కొద్దిరోజులకే మృత్యువాత పడ్డారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ntr jayanti who were the factors behind his death
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com