YCP: అధికారంలో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీతో స్నేహం అవసరం ఉండదు. కానీ ప్రతిపక్షంలో ఉన్న వారికి మాత్రం తోడుగా ఏదో ఒక రాజకీయ పార్టీ అవసరం ఉంటుంది. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అనుసరిస్తున్న ఒంటరి పోరు వ్యూహంతో.. ఆ పార్టీతో స్నేహం చేసేందుకు ఎవ్వరు ముందుకు రాని పరిస్థితి. అప్పుడు కలుపుకెళ్లలేదు. ఇప్పుడు ఎవరు కలిసి రావడం లేదు. ఇది ముమ్మాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంక్లిష్ట పరిస్థితి. రాష్ట్రంలో టిడిపి కూటమిలో జనసేనతో పాటు బిజెపి ఉంది. వైసిపి ఒంటరిగా ఉండగా.. కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నాయి. కానీ అవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూడడం లేదు.
* చాలా నిర్లక్ష్యంగా..
ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చేశాం. ఐదు కోట్ల మందికి టచ్ చేసాం.. మనకి ఇంకొకరితో పని ఏంటి అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావించింది. పోనీ అంతటితో ఆగారంటే అది లేదు. దమ్ముంటే ఒంటరిగా రండి.. అందరూ కలిసి గెలిచారు తప్ప.. ఒంటరిగా రాలేకపోయారు అంటూ ప్రత్యర్థులను ఎగతాళి కూడా చేసింది వైసిపి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇతర రాజకీయ పార్టీలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడంలో విఫలమయ్యారు. నాయకత్వంలోని లెక్కలేని తనం, అహంకారం వల్ల సొంత పార్టీ నేతలు పార్టీకి దూరమైనారు. కొత్త మిత్రులు రావడం దాదాపు అసాధ్యం గా కనిపిస్తోంది. పోనీ బిజెపిని స్నేహం చేసుకుందాం అంటే కుదరని పని. పొత్తు పెట్టుకోవడం అంతకంటే కుదరని పని.
* ఫలించని ప్రయత్నాలు..
ఇటువంటి పరిస్థితుల్లో ఇతర పార్టీలను కలుపుకొని వెళ్లేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్తున్నారు కానీ.. ఎవరు ముందుకు రావడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో జై భీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్ కుమార్ వంటి వారి ఆ పార్టీకి దిక్కుగా మారారు. అయితే కనీస ఓట్లు తెచ్చుకోలేదు జడ శ్రవణ్ కుమార్ గత ఎన్నికల్లో. అందుకే ఆయనతో పెద్దగా లాభం లేదు. ఆపై ఒకప్పుడు ఎస్సీ,ఎస్టీ, బీసీలపై దాడులు జరుగుతున్నాయని జగన్ ప్రభుత్వం పై నిత్య విమర్శలు చేసేవారు శ్రవణ్. ఇప్పుడు అదే పార్టీకి మద్దతుగా నిలవడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గత్యంతరం లేదు. మరో పార్టీ ఆప్షన్ లేకుండా పోయింది. అది ఎంత మాత్రం స్వయంకృతాపమే.