Homeఆంధ్రప్రదేశ్‌Jagan Political Struggle: ఎంత చేసినా జగన్ కు కష్టమే.. ‘బాబు’పై అంత పాజిటివ్

Jagan Political Struggle: ఎంత చేసినా జగన్ కు కష్టమే.. ‘బాబు’పై అంత పాజిటివ్

Jagan Political Struggle: కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తోంది. ఈ రెండేళ్ల పాలనపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అవుతోంది. ఒకవైపు పరిపాలన.. మరోవైపు అభివృద్ధి.. భారీగా విదేశీ పెట్టుబడులు.. ఊహించని విధంగా అందరికీ సమాన పదవులు.. నూతన ఉత్తేజాన్ని నింపుతున్నాయి. సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఏపీకి గేమ్ చేంజర్ గా నిలుస్తోంది. సూపర్ సిక్స్ పథకాల( super six schemes ) సూపర్ హిట్ తో తన మార్కు పాలన చూపించారు సీఎం చంద్రబాబు. సుపరిపాలనతో బ్రాండ్ ఇమేజ్.. తన చొరవతో లక్షల కోట్ల పెట్టుబడులు.. పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు నాంది పలికారు చంద్రబాబు. అద్భుత వేగంతో రాజధాని అమరావతి పనులు ముందుకు సాగుతూ ఉండడం కూడా ప్రజల్లో సంతృప్తికి కారణం.

ప్రజల్లో సంతృప్తి..
ఏపీలో( Andhra Pradesh) కూటమి 2024 జూన్ లో అధికారంలోకి వచ్చింది. కానీ తొలి మూడు నెలలు పాలన గాడిలో పెట్టేందుకు సమయం కేటాయించింది. అయితే రెండేళ్ల పాలనలోనే ఎన్నికల్లో ఇచ్చిన మెజారిటీ హామీలను నెరవేర్చింది. చెప్పని అంశాలను కూడా ప్రజలకు అందించి సంతృప్తి శాతాన్ని దక్కించుకున్నారు సీఎం చంద్రబాబు. గత అనుభవాల దృష్ట్యా ఈ విషయాన్ని ముందే గ్రహించగలిగారు చంద్రబాబు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమప్రధాన్యంతో చూశారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలిగారు. గ్రామాల స్వరూపాన్ని మార్చేశారు. దాదాపు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో విజయవంతం అయ్యారు సీఎం చంద్రబాబు. అందుకే ప్రజలు కూడా ఎంతో హర్షించారు. ఏ ప్రభుత్వానికైనా తొలి రెండేళ్లు కీలకం. అటువంటిది ఆ రెండేళ్ల కాలాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు.

కేంద్రం సాయం..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఇప్పటివరకు మూడు ప్రభుత్వాలు కొలువుదీ రాయి. కానీ గత రెండు ప్రభుత్వాలకు భిన్నంగా ఈసారి కేంద్రం నుంచి భారీగా సాయం అందుతుంది కూటమి ప్రభుత్వానికి. ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకున్న 23 పాలసీలతో దేశాన్ని ఆకర్షించే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం చేరుకుంది. అందుకే ది గ్రేట్ ఎకనామిక్ టైమ్స్ దినపత్రిక.. ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 ను ఏపీ ప్రభుత్వానికి అందించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దానికి ఒకే ఒక్క కారణం ఏపీ సీఎం చంద్రబాబు. గత 20 నెలల పాలనలో ప్రభుత్వం చూపించిన ప్రగతి గురించి ఎంత చెప్పినా తక్కువే.

సానుకూల దృక్పథంతో..
సానుకూల దృక్పథంతో సీఎం చంద్రబాబు( CM Chandrababu) ముందుకు సాగుతున్నారు. గతంలో తన పాలనలో ఎదురైన వైఫల్యాలను అధిగమించి ముందుకు సాగుతున్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. 6000 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేశారు. గ్రూప్1, గ్రూప్ 2 పోస్టుల నియామకం పూర్తయింది. పరిశ్రమల రాకతో పాటు ప్రపంచానికే తలమానికం అయిన ఐటీ సంస్థలు ఏపీ వైపు వస్తున్నాయి. దీంతో అన్ని వర్గాల వారు సంతృప్తితో ఉన్నారు. సహజంగానే ప్రతిపక్ష పార్టీగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రజల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి అదే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఐదేళ్ల పాలనలో వైఫల్యాలు, చంద్రబాబు చూపిస్తున్న పాలనా ప్రగతితో ఎంత మాత్రం బలపడలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్న వర్కౌట్ కాకపోవడం చూస్తుంటే కష్టమే అనిపిస్తుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular