News Office Controversy: అరుంధతి సినిమాలో పశుపతిని జేజమ్మ బంధిస్తుంది. అయినప్పటికీ అతడు తన మాయాజాలంతో బయటికి వస్తాడు. వదలా బొమ్మాలి వదలా అంటూ వెంటపడుతుంటాడు. ఈ ఎడిషన్ ఇంచార్జి కూడా అలాంటి వాడే. ఆ పత్రిక మేనేజ్మెంట్ ఇటీవల అతడి పై చర్యలు తీసుకున్నప్పటికీ.. ఎడిషన్ ఇంచార్జ్ నుంచి సబ్ ఎడిటర్ గా డీమోషన్ చేసినప్పటికీ అతడు ఆ సంస్థను పట్టుకొని వేలాడుతున్నాడు.
ఆ పత్రిక అధిపతి సొంత జిల్లాలో అతడు పని చేశాడు. దాదాపు 14 సంవత్సరాల పాటు ఆ జిల్లాకు ఎడిషన్ ఇంచార్జిగా కొనసాగాడు. పేరుకు ఎడిషన్ ఇంచార్జి మాత్రమే అయినప్పటికీ.. జిల్లాలోని నెట్వర్క్ లో ఇతడు వేలు పెట్టేవాడు. చివరికి కాలు కూడా పెట్టేవాడు.. బ్యూరోకు తెలియకుండానే వార్తలు రాసేవాడు. ఏదో ఒక డేట్ లైన్ పెట్టేవాడు. ఆ తర్వాత వసూలు చేసుకునేవాడు. ప్రతి విలేఖరికి టార్గెట్ పెట్టేవాడు. టార్గెట్ రీచ్ కానీ విలేకరిని ఇబ్బంది పెట్టేవాడు. ఇక ఈ ఎడిషన్ ఇంచార్జికి దావత్ లు అంటే చాలా ఇష్టం. తాగడం, తినడమంటే మహా ఇష్టం. అందువల్లే డెస్క్ లో పనిచేసే సబ్ ఎడిటర్లను కూడా దావత్ లు ఇవ్వాలని ఆ ఎడిషన్ ఇంచార్జ్ వేధించేవాడు. అయితే ఇటీవల ఒక విలేఖరి వద్ద డబ్బులు తీసుకున్నాడు. అంతేకాదు వేధింపులు కూడా మొదలుపెట్టాడు. దీంతో అతడు తన బాధను స్వీయ వీడియో ద్వారా సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ విషయం మేనేజ్మెంట్ దృష్టికి రావడంతో ఆ ఎడిషన్ ఇంచార్జి ని ఉన్నఫలంగా ఆ పోస్ట్ నుంచి తొలగించింది. అంతేకాదు ఉపసంపాదకుడిగా వేరే జిల్లాకు బదిలీ చేసింది.. దీంతో అతడు ఆ జిల్లాకు పోడని.. ఉపసంపాదకుడిగా పనిచేయడని అందరూ అనుకున్నారు. కానీ అతడు అందరికీ షాక్ ఇస్తూ ఆ జిల్లాలో చేరిపోయాడు.
Also Read: Jagan Press Meet Highlights: 3 ఏళ్లలో టీడీపీని దించి అధికారంలోకి.. అసలు జగన్ ధీమా ఏంటి?
ఎన్ని రోజులు పాటు ఆ జిల్లాలో సెకండ్ ఇంచార్జిగా ఉన్న వ్యక్తి రాజీనామా చేశాడు. దానికి కారణం లేకపోలేదు. గతంలో ఆ జిల్లాలో పనిచేసిన ఎడిషన్ ఇంచార్జి ను మేనేజ్మెంట్ వేరే జిల్లాకు బదిలీ చేసింది. అక్కడ పనిచేసే ఎడిషన్ ఇంచార్జి ఈ జిల్లాకు పంపించింది. ఏడాది పాటు వారిద్దరు పనిచేశారు. మళ్లీ మేనేజ్మెంట్ కు ఏమైందో తెలియదు.. వారిద్దరిని పూర్వ స్థానాలకు పంపించింది. నాడు సెకండ్ ఇంచార్జిగా పని చేసిన వ్యక్తి..తనకు ఎడిషన్ ఇంచార్జిగా ప్రమోషన్ ఇస్తారని అనుకున్నాడు. కానీ అతనికి అలాంటి అవకాశం ఇవ్వకపోవడంతో.. మేనేజ్మెంట్ తనకు ఎప్పటికీ ప్రమోషన్ ఇవ్వదని భావించి అతడు తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. గత శనివారమే తన రాజీనామా లేఖను మేనేజ్మెంట్ కు ఇచ్చాడు.. మొత్తంగా చూస్తే ఆ జిల్లా పత్రిక కార్యాలయంలో రకరకాల వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు వేరే జిల్లా నుంచి వచ్చిన ఆ మాజీ ఎడిషన్ ఇన్చార్జిని సెకండ్ ఇంచార్జ్ చేస్తారా.. లేకుంటే వేరే వ్యక్తికి అవకాశం ఇస్తారా అనేది చూడాల్సి ఉంది.