Narendra Modi : ప్రధాని మోడీ స్వరం మారింది. ఎప్పుడు నోరు తెరిస్తే బిజెపి భావజాలం ప్రదర్శించే మోదీ..ఇప్పుడు ఎన్డీఏ అంటూ సంబోధిస్తున్నారు. ఎన్డీఏ భాగస్వామి పక్షాల సమావేశంలో పూర్తిగా మారిపోయిన మోడీ కనిపించారు.ముఖ్యంగా ఏపీ గురించే చర్చించారు. చంద్రబాబుతో పాటు పవన్ ను ఆకాశానికి ఎత్తేశారు.ఏపీలో కూటమి గురించి ప్రస్తావిస్తూ.. పవన్ ను తుఫానుతో పోల్చారు. ఇక చంద్రబాబును పక్కనే కూర్చోబెట్టి ఉల్లాసంగా గడిపారు. సరదాగా మాట్లాడారు. చలోక్తులు విసురుకున్నారు. మోదీ లో ఈ మార్పు చూసిన చంద్రబాబు తన స్టైల్లో అల్లుకుపోయారు.
2014లో సైతం తొలిసారిగా అధికారంలోకి వచ్చారు మోడీ. కానీ ఈ స్థాయిలో ఏపీ అవసరం ఏర్పడలేదు. సొంతంగా మెజారిటీ వచ్చింది కనుక వీరితో పనేంటి అన్న రీతిలో వ్యవహరించారు. కానీ ఇప్పుడు కేంద్ర అవసరాలనుతీర్చే స్థితికి ఏపీ చేరుకుంది.అందుకే ఏపీ గురించి మోడీ ప్రస్తావించక తప్పదు.పైగా ప్రత్యామ్నాయం లేదు.వైసీపీకి సీట్లు రాలేదు. వచ్చే మిత్రులు కనిపించడం లేదు. చంద్రబాబు బయటకు వెళ్తే తీసుకోవడానికి ఇండియా కూటమి సిద్ధంగా ఉంది. మరో దారి లేక ఏపీ మిత్రులనే నమ్ముకొని ప్రధాని మోదీ వారిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రధాని మోదీ ప్రవర్తన చూస్తుంటే ఏపీకి మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తున్నాయి.
గత ఎన్నికల తర్వాత పవన్ మిత్రుడు అయ్యాడు. ఎన్డీఏలో చేరాడు. కానీ ప్రధాని మోదీని కలిసింది చాలా అరుదు. జగన్ మిత్రుడు కాదు. కనీసం తమ భావజాలానికి దగ్గరైన నేత కాదు. అయినా సరే గత ఐదేళ్లలో ఎనలేని ప్రాధాన్యం దక్కింది జగన్ కు కేంద్రం పరంగా గౌరవించామే తప్ప.. పార్టీ పరంగా ఎన్నడూ లేదని బిజెపి సమర్థించుకుంది. గడ్డం మాదిరిగా వైసీపీకి సీట్లు వచ్చి ఉంటే ఆ గౌరవం కొనసాగేది. కానీ ఇప్పుడు సీట్ల పరంగా పెద్ద పార్టీ టిడిపి. అందుకే ఎనలేని గౌరవం చంద్రబాబుకు దక్కుతోంది. అదే సమయంలో చంద్రబాబుకు అత్యంత మిత్రుడు గా మారిన పవన్ సైతం కేంద్రానికి అవసరమయ్యారు. అయితే ఇదే పరిస్థితి కొనసాగితే ఏపీ కనీస అవసరాలు తీరేవి.విభజన హామీలు.మరి ఇవ్వాలనుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వవచ్చు.రైల్వే జోన్ ప్రకటించవచ్చు. పోలవరానికి నిధులు ఇవ్వొచ్చు. అంతదాకా ఈ చనువు కొనసాగాలని.. చంద్రబాబు, పవన్ కు కేంద్రంలో గౌరవం దక్కాలని సగటు ఏపీ ప్రజలుబలంగా కోరుకుంటున్నారు.