PM Narendra Modi
Narendra Modi : ఏపీ ( Andhra Pradesh)విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి ప్రత్యేక నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నారు. గతంలో విశాఖకు వచ్చి లక్షల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. విశాఖపట్నం రైల్వే జోన్ కు శంకుస్థాపన చేశారు. అయితే ప్రధాని మరోసారి ఏపీకి వస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈనెల రెండో వారంలో ప్రధాని మోదీ ఏపీకి రానున్నట్లు తెలుస్తోంది. జనవరిలో విశాఖలో ప్రధాని మోదీ పర్యటించిన సంగతి తెలిసిందే. రెండు నెలల తిరగకముందే.. మరోసారి ఏపీకి ప్రధాని వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* క్షిపణి పరీక్షా కేంద్రానికి శంకుస్థాపన
కృష్ణా జిల్లా( Krishna district) నాగాయలంక మండలం గొల్లలమోదలో నిర్మించ తలపెట్టిన రక్షణ శాఖకు చెందిన క్షిపణీ పరీక్ష కేంద్రానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రక్షణ శాఖలో కీలకమైన క్షిపణి వ్యవస్థకు మోడీ సర్కార్ అత్యంత ప్రాధాన్యమిస్తూ వస్తోంది. ఈ క్రమంలో గత టిడిపి హయాంలోనే నాగాయలంకలోని గుల్లలమోదను ఎంపిక చేశారు. సమీపంలోనే తీరం ఉండడం.. భూమ్యాకర్షణ శక్తి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీనిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : 75 ఏళ్ల వయసులో నరేంద్ర మోడీ ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం అదేనట.. ఇన్నాళ్లకు సీక్రెట్ తెలిసింది కదా..
* డిఆర్డిఓ నుంచి భారీగా నిధులు
ఈ ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు కోసం డిఆర్డి( DRDO ) 15 వేల కోట్ల నుంచి 20వేల కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ క్షిపని పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమని 2011లోనే తేలింది. 2017లో భూ కేటాయింపులు జరిగినా.. మిగతా పనులు నిలిచాయి. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం చర్చించింది. శంకుస్థాపనకు తానే వస్తానని మోడీ స్వయంగా అంగీకరించారు. కానీ ఎందుకో అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సానుకూలత చూపింది. దీంతో ప్రధాని మోడీ సైతం శంకుస్థాపనకు సిద్ధపడ్డారు. అదే విషయంపై కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వపరంగా ప్రధాని మోదీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
* ఏపీకి ఎనలేని ప్రాధాన్యం
అయితే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కు( Andhra Pradesh) అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు అవుతోంది. ఇప్పటికే విశాఖ జిల్లాలో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. ప్రత్యేక రైల్వే జోన్ కు సైతం శంకుస్థాపన చేసి ఏపీ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అయితే గత రెండుసార్లు కంటే ఈసారి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు ఏపీకి. ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామి కావడంతోనే ప్రాధాన్యత ఇస్తున్నట్లు గెలుస్తోంది. అయితే మిగతా రాష్ట్రాలు మాత్రం ఈ విషయంలో పెదవి విరుస్తున్నాయి. కేవలం ఏపీకి మాత్రమే ప్రాధాన్యం ఇస్తుండడాన్ని ప్రశ్నిస్తున్నాయి.
Also Read : పోసానిపై కేసుల మీద కేసులు.. వదిలేదే లే.. ఈసారి ఎవరి వంతంటే?