Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: ఆ పాఠశాలను లోకేష్ నిలబెట్టిన తీరు హాట్సాఫ్!

Nara Lokesh: ఆ పాఠశాలను లోకేష్ నిలబెట్టిన తీరు హాట్సాఫ్!

Nara Lokesh: విశాఖ ఉక్కు నగరంలోని విమల విద్యాలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ పాఠశాల వివిధ కారణాలతో మూతపడింది. ఆర్ సి ఎం డయాసిస్ భాగస్వామ్యంతో ఈ పాఠశాల నడిచేది. ఉన్నట్టుండి ఆ సమస్త ఆర్థిక సహకారం నిలిపివేయడంతో పాఠశాలకు తాళం పడింది. దాదాపు రెండు వేల మందికి పైగా విద్యార్థుల చదువులు ప్రశ్నార్ధకంగా మారాయి. వందలాది మంది ఉపాధ్యాయులు, సిబ్బంది వీధిన పడ్డారు. అయితే ఈ విషయం మంత్రి నారా లోకేష్ కు తెలిసింది. ఆయన ప్రత్యేక చొరవ చూపడంతో ఆ పాఠశాల తిరిగి తెరుచుకుంది. వందలాదిమంది అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. ఈరోజు నుంచి మధ్యాహ్నం భోజనం పథకం సైతం మొదలైంది. నిజంగా ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నిధుల కొరతతో నిలిచిపోయిన ఓ పాఠశాలను.. ప్రభుత్వమే బాధ్యతలు తీసుకొని పున: ప్రారంభించేలా చేయడంలో లోకేష్ చూపిన చొరవ మాత్రం నిజంగా అభినందనీయం.

* ఆ సంస్థ ఆర్థిక సహకారంతో..
1984లో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్.. విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితుల ఉచిత విద్యుత్ అందించేందుకు ఆర్ సి ఎం డయాసిస్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు స్కూలును ప్రారంభించింది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నిరుపేదల విద్యా నిలయంగా వెలుగొందింది. అయితే రెండేళ్ల కిందట 2024 జూన్ లో ఈ విద్యాలయానికి ఆర్ ఐ ఎన్ ఎల్ సంస్థ ఆర్ధిక సాయాన్ని పూర్తిగా నిలిపివేసింది. దీంతో పాఠశాలకు తాళం పడింది. స్థానిక ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందించారు. దశాబ్దాలనాటి విద్యా వారసత్వాన్ని కాపాడేందుకు నడుం బిగించారు.

* ప్రభుత్వమే బాధ్యత తీసుకుని..
అంతటి సుదీర్ఘ చరిత్రను కలిగిన ఆ పాఠశాలను కార్పొరేట్ సంస్థలు, ఎన్జీవోలు కచ్చితంగా తీసుకుంటారు. కానీ మరోసారి ఆ పాఠశాల ప్రమాదంలో పడకుండా మంత్రి నారా లోకేష్ పటిష్ట చర్యలు చేపట్టారు. ప్రభుత్వమే ఈ పాఠశాల పూర్తి నిర్వహణ బాధ్యతలను తీసుకునేలా విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖ వ్యాలీ స్కూల్ మోడల్ లో.. జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఒక ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో విమలా విద్యాలయం కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ ఆయన చేసిన నిరంతర పర్యవేక్షణలో ఈ నెల 12న పాఠశాల ప్రారంభం అయింది. జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. అదే రోజు యూకేజీ నుంచి పదో తరగతి వరకు ఏకంగా 778 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. అంతటితో ఆగకుండా పేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభించారు. ఈ పాఠశాలను కాపాడడంలో మంత్రి నారా లోకేష్ పాత్ర మరువరానిది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version