Nara Lokesh : రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఓ ఏడాదిన్నర కిందట నారా లోకేష్( Nara Lokesh) పరిస్థితి చూస్తే వైసీపీకి ఎంత చులకన భావం ఉండేదో తెలియనిది కాదు. మొద్దబ్బాయి.. బొద్ధబ్బాయి.. పప్పు.. తండ్రి చాటు బిడ్డ.. కనీసం తెలుగులో మాట్లాడడం రాదు.. మంగళగిరి అనే పలకలేడు.. ఇలా ఎన్నెన్నో మాటలు అన్నారు వైయస్సార్ కాంగ్రెస్ నేతలు. చంద్రబాబు జాకీలు పెట్టినా లేవలేడు అంటూ రోజా లాంటి నేతలు ఎద్దేవా చేసేవారు. జగన్మోహన్ రెడ్డి చిటికెన వేలు కూడా టచ్ చేయలేదు అంటూ చాలా రకాలుగా, హీనంగా మాట్లాడేవారు. మరి ఇప్పుడు లోకేష్ పరిస్థితి ఏంటి? అని చూస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వార్తలు షాక్ అవుతున్నారు.
* ప్రధానితో చనువుగా..
సాధారణంగా సీఎం చంద్రబాబు( CM Chandrababu) ఢిల్లీ పర్యటనకు వెళితేనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన బాధ కనిపిస్తుంది. ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులతో చంద్రబాబు దిగిన ఫోటోలు.. సోషల్ మీడియాలో వస్తే తట్టుకోలేకపోతుంటారు. వారి గుండెలు తరుక్కుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటిది నారా లోకేష్ ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీతో తరచూ సమావేశం అవుతున్నారు. మోడీ పక్కన కూర్చొని ముచ్చట్లు చెబుతున్నారు. ఇది ముమ్మాటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జీర్ణించుకోలేని అంశం. లోకేష్ ను వదిలి ప్రధాని మోదీని ఆడిపోసుకున్నవారు ఉన్నారు.
* మంచి పదవులతో రాజభోగం..
ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ టచ్ చేసిన టిడిపి నేతలంతా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. రాజకీయాలకు పనికిరారని వైసీపీ తీసి పక్కన పడేసిన ప్రతి నాయకుడు ఇప్పుడు పదవులు వెలగబెట్టారు. మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, రఘురామకృష్ణంరాజు, అయ్యన్నపాత్రుడు.. వైసిపి టార్గెట్ చేసిన నేతల జాబితా చాలా వరకు ఉంది. అయితే వారంతా పెద్ద పదవులు, రాజభోగాలు అనుభవిస్తున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ ను చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు కనువిప్పుతో మాట్లాడుతున్నారు. మరికొందరు మాత్రం ఈగోలకు పోతున్నారు. అయితే గతం మాదిరిగా లోకేష్ విషయంలో పలుచన చేసే ధైర్యం మాత్రం చేయడం లేదు. లోకేష్ పరిణితిని చూసి షాక్ అయినవారు ఉన్నారు. అయితే ఏది జరిగినా మన మంచికే. ఈ విషయంలో లోకేష్ గ్రేట్. ఆయన సహనానికి గ్రేట్.