Nara Lokesh : లోకేష్ కు ఇష్టుడిగా వైఎస్సార్.. చంద్రబాబు షాక్

వైఎస్ కు నివాళులర్పించి ఎంతో మంచోరని కితాబిస్తున్నారు. దీనికి అనేక రకాలైన కారణాలు చెబుతున్నారు.వైఎస్సార్ చంద్రబాబు చేపట్టిన ఏ ప్రాజెక్ట్ ని ఆపలేదు. రాష్ట్రాన్ని ఆయన విధ్వంసం చేయలేదు. రాష్ట్రం పరువు తీయలేదు అందుకే ఆయన గొప్ప వారు అని లోకేష్ అంటున్నారు.

Written By: Dharma, Updated On : May 20, 2023 12:36 pm
Follow us on

Nara Lokesh : ‘పోయినోళ్లందరూ మంచొళ్లు.. ఉన్నోళ్లు.. పోయినోళ్ల తీపి గురుతులు’ దూరమైన వారిని గుర్తుచేసుకుంటూ చెప్పుకునే మాటలివి. బాధిత కుటుంబాల పరామర్శల సమయంలో చేసే వ్యాఖ్యలివి. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ ఇవే మాటలను గుర్తుచేస్తున్నారు. తన తండ్రి రాజకీయ ప్రత్యర్థి రాజశేఖర్ రెడ్డి గొప్పోడు అంటూ అభినందిస్తున్నారు. కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న లోకేష్ పావురాల గుట్ట వద్ద నిలిచి మరీ మహానేతకు నివాళులర్పించారు. అనంతరం బనగానపల్లిలో జరిగిన బహిరంగ సభలో తాను ఎందుకు రాజశేఖర్ రెడ్డికి దండం పెట్టాల్సి వచ్చిందో వివరించారు.

ఓ ఐదేళ్ల కిందట ఇటువంటి సీనే ఒకటి కనిపించింది. కానీ పాత్రలు, పాత్రధారులు మారిపోయారు. విపక్ష నేతగా సీఎం జగన్ పాదయాత్ర చేశారు. ఆ సమయంలో దారిపొడవునా ఉండే ఎన్టీఆర్ విగ్రహాలకు నమస్కరించి నివాళులర్పించేవారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు తూట్లు పొడిచారని ఆరోపించారు. విరుద్ధమైన పాలన చేస్తున్నారని దుయ్యబట్టేవారు. దీంతో ఎన్టీఆర్ అభిమానించే, ఆరాధించేవారు టీడీపీకి దూరమయ్యారు. వైసీపీకి ఓటరుగా మారిపోయారు.

ఇప్పుడు అదే పని లోకేష్ చేస్తున్నారు. వైఎస్ కు నివాళులర్పించి ఎంతో మంచోరని కితాబిస్తున్నారు. దీనికి అనేక రకాలైన కారణాలు చెబుతున్నారు.వైఎస్సార్ చంద్రబాబు చేపట్టిన ఏ ప్రాజెక్ట్ ని ఆపలేదు. రాష్ట్రాన్ని ఆయన విధ్వంసం చేయలేదు. రాష్ట్రం పరువు తీయలేదు అందుకే ఆయన గొప్ప వారు అని లోకేష్ అంటున్నారు. అదే జగన్ అయితే ఏపీని సర్వ నాశనం చేశారని రాష్ట్రం ఈ రోజు ఈ విధంగా మారడానికి ఆయన పాలన కారణం అని లోకేష్ చెప్పుకొచ్చారు. వైఎస్సార్ అంటే తనకు గౌరవం ఎంతో ఉంది అని చినబాబు చెప్పుకున్నారు.

మొత్తానికైతే నాడు జగన్ వ్యూహాన్నే నేడు లోకేష్ అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీకి రాజశేఖర్ రెడ్డి ఇష్టుడైన నేతగా మార్చేస్తున్నారు. పరోక్షంగా వైఎస్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను లోకేష్ దెప్పిపొడుస్తున్నారు. కానీ ఆ అభిప్రాయం బయటపడకుండా చాలా జాగ్రత్తగా నడుచుకుంటున్నారు. కానీ రాయలసీమలో ఉన్న వైఎస్సార్ ఫ్యాన్ కోసమే ఈ వ్యాఖ్యలంటూ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.