Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh Open Offer To Jagan: లోకేష్ వెంట జగన్.. ఓపెన్ ఆఫర్!

Nara Lokesh Open Offer To Jagan: లోకేష్ వెంట జగన్.. ఓపెన్ ఆఫర్!

Nara Lokesh Open Offer To Jagan: ఇప్పుడు అంతటా క్రికెట్ ఫీవర్ నెలకొంది. టి20 ప్రపంచ కప్ టోర్నీ ( T20 World Cup) జరుగుతోంది. ఇండియా టీం బాగానే ఆడుతోంది. అయితే ఇండియా టీం ఆడే కీలక మ్యాచులు వీక్షించేందుకు ఏపీ మంత్రి నారా లోకేష్ వెళ్తుంటారు. మొన్ననే కొలంబో వెళ్లి వచ్చారు. అయితే లోకేష్ క్రికెట్ మ్యాచ్లు చూసేందుకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. అయితే దానిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నారా లోకేష్. టి20 ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్ కు వెళ్తే.. తప్పకుండా ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వెళ్తానని తేల్చి చెప్పారు. తాను వెళ్లడమే కాదు జగన్మోహన్ రెడ్డిని సైతం తీసుకెళ్తానని చెప్పారు. నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు హాజరు కావడంపై టీడీపీ, వైసిపి మధ్య సోషల్ మీడియాలో వార్ జరిగింది. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ సెటైర్లు వేశారు.

* క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు..
మంత్రి నారా లోకేష్ కు ( Minister Nara Lokesh) క్రికెట్ అంటే చాలా ఇష్టం. బాగా ఆడుతారు కూడా. ఎంతటి బిజీగా ఉన్న క్రికెట్ మ్యాచ్ అంటే చాలు వాలిపోతారు. పైగా ఏపీలో క్రికెట్ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. అంతర్జాతీయ మైదానాలను ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఈ తరుణంలో ఐసిసి అధ్యక్షుడిగా ఉన్న జై షా తో లోకేష్ సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడే జై షా. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ప్రతిసారి లోకేష్ జై షా ను కలుస్తూ ఉంటారు. మొన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ను సైతం కలిసి చూస్తుంటారు. అయితే ప్రభుత్వ ఖర్చులతో నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ లు చూస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. వైసిపి సోషల్ మీడియా సైతం దీనినే హైలెట్ చేస్తూ వచ్చింది. అందుకే నారా లోకేష్ ఇప్పుడు సెటైరికల్ గా మాట్లాడారు.

* బిజీ షెడ్యూల్ తో..
ముందు రోజు రాత్రి పాకిస్తాన్ తో కొలంబోలో( Colombo) భారత్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఎంతో సందడిగా గడిపారు లోకేష్. ఆ తరువాత రోజు ఉదయం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమరావతి వచ్చారు. ఆయనకు స్వాగతం పలికారు లోకేష్. ఈ తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి స్పందించి మాట్లాడారు. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు కొలంబో గ్రౌండ్ వరకు వెళ్లడం ఎందుకు.. చూడాలనుకుంటే టీవీలో సరిపోతుంది అంటూ సెటైర్లు వేశారు. అయితే దీనిపై ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగింది. మంత్రి నారా లోకేష్ సొంత ఖర్చులతోనే క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు వెళ్తున్నారని క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు దాని పైనే నారా లోకేష్ స్పందించారు. భారత్ t20 టోర్నీలో ఫైనల్ కు వస్తే మ్యాచ్ చూసేందుకు వెళ్తానని.. జగన్ వస్తే తీసుకెళ్తానని.. మ్యాచ్ టికెట్లు నావే.. ఫ్లైట్ టికెట్లు నావే.. సొంత డబ్బుతో మ్యాచ్ చూడడానికి వెళ్ళా.. నీ దుడ్లు ఏమైనా పెట్టానా అంటూ నారా లోకేష్ సెటైరికల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version