Nara Lokesh: తాత మహానాయకుడు, తండ్రి విజయం ఉన్న నేత.. అయినా సరే నారా లోకేష్ ( Nara Lokesh )రాజకీయ రంగ ప్రవేశం అంత ఈజీగా జరగలేదు. కష్టాలను అధిగమించారు. ప్రత్యర్థుల హేళనను పట్టుకున్నారు. తనపై జరిగిన విషప్రచారాన్ని పూలుగా మార్చుకున్నారు. తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. నాయకుడిగా తన ముద్ర చాటుకున్నారు. ఓటమి ఎదురైనచోట గెలుపు బాట అందుకొని.. విమర్శకుల నోటికి తాళం వేశారు నారా లోకేష్. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేక భేటీ కానున్నారు. ఓ ప్రధాని ఓ రాష్ట్రస్థాయి మంత్రితో భేటీ కావడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఈ కలయిక వెనుక తెలుగుదేశం పార్టీ ఉందన్న విషయాన్ని గ్రహించుకోవాలి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి కర్త,క్రియ, కర్మ అంతా లోకేష్ అనేది జగమెరిగిన సత్యం. అందుకే అంతటి ప్రాధాన్యత ఆయనకు దక్కుతోంది.
Also Read: ప్రధాని చెంతకు లోకేష్.. చంద్రబాబు నయా ప్లాన్!
నారా లోకేష్ నేరుగా రాజకీయాల్లోకి రాలేదు. టిడిపి కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా వారి బాధ్యతలను తీసుకున్నారు. తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా తనదైన శైలిలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. దారి పొడవునా ఎన్నో ముళ్ళు, రాళ్లు, ఇబ్బందులు ఉన్నా వాటన్నింటినీ అధిగమించి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. పదవుల పరంగా ఎంత స్థాయికి వెళ్ళినా.. అది కార్యకర్తల చలువ అని గుర్తించారు నారా లోకేష్. అందుకే వారి సంక్షేమానికి పెద్దపీట వేశారు. వారి అభివృద్ధికి పునాదులు వేస్తారు. కష్టంలో ఉన్న కార్యకర్తకు అండగా నిలిచేందుకు ఎల్లప్పుడూ ముందుండే లోకేష్ తాజాగా టిడిపి కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
* ఏడాది అవుతున్న తరుణంలో..
సాధారణంగా నారా లోకేష్ టిడిపి శ్రేణులకు అండగా నిలబడతారు. వారు ఏ కష్టంలో ఉన్నా పాలు పంచుకుంటూ ముందుకు సాగుతుంటారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ పార్టీ కార్యకర్తలకు కీలక సూచనలు చేయడం విశేషం. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తున్న తరుణంలో ఈ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. నారా లోకేష్ కార్యకర్తలకు ఏం పిలుపు ఇచ్చారంటే..
* కీలక సూచనలు..
1, దయచేసి మీరు గ్రామంలో యూనిటీగా ఉండండి
2, గ్రామస్థాయిలో పని జరగకపోతే మండల పార్టీ నాయకుల ద్వారా పనులు చేసుకోండి
3, అప్పటికి అవ్వకపోతే స్థానిక శాసన సభ్యుడు దగ్గరకు వెళ్ళండి
4, అప్పటికి అవ్వకపోతే మీ జిల్లా ఇన్చార్జ్ మంత్రిని సంప్రదించండి
5, అక్కడ కూడా పని జరగకపోతే టిడిపి కేంద్ర కార్యాలయంలో అర్జీ ఇవ్వండి. మనం ఇంట్లో ఉంటే పనులు అవ్వవు. దయచేసి మీ సొంత పనులు అడగండి. ఇతరులకు సమస్యలు ఉన్నా తీసుకురండి. ఎక్కడా నిరుత్సాహ పడవద్దు. అమ్మ మీద, నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగకండి. పార్టీ అమ్మలాంటిది అని మరిచిపోవద్దు. దయచేసి మూడో వ్యక్తి చెప్పింది నమ్మవద్దు. మీరు లైవ్ లో విన్నవి మాత్రమే నమ్మండి. మన ఎమ్మెల్యే వైసీపీ వాళ్ళకి పని చేస్తున్నాడు అంట? లోకేష్ టైం ఇవ్వడం లేదు అంటా? బాబు గారు అసలు కలవడం లేదు అంటా? అటువంటి పుకార్లు నమ్మవద్దు. తెలియకుండా తప్పులు చేయవద్దు అంటూ లోకేష్ అత్యంత విలువైన సలహాలు ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది.
* విష ప్రచారంతో..
ఇటీవల కూటమి ప్రభుత్వంతో పాటు తెలుగుదేశం పార్టీపై సోషల్ మీడియాలో( social media) విపరీతమైన విష ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా టిడిపి శ్రేణుల పనులు జరగడంలేదని.. వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణుల పనుల్లో ఎమ్మెల్యేలు తల దూర్చుతున్నారని.. వారికి పెద్ద పీట వేస్తున్నారని.. వారి వద్ద కమిషన్లు తీసుకుంటున్నారని రకరకాల ప్రచారం నడుస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతోనే నారా లోకేష్ నేరుగా స్పందించారు. పార్టీ శ్రేణుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. ప్రభుత్వంతోపాటు తమకు కార్యకర్తలే ముఖ్యమైన విషయాన్ని నేరుగా వారికే పంపించారు. విష ప్రచారం నమ్మవద్దని సూచనలు చేశారు.