Nara Lokesh: ఇప్పుడు నారా కుటుంబ శకం నడుస్తోంది. ఆ కుటుంబంలో ఐదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్( Minister Nara Lokesh) వ్యవహరిస్తున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ బాధ్యతలను చూస్తున్నారు బ్రాహ్మణి. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సేవలందిస్తున్నారు భువనేశ్వరి. దేవాన్సు చదువుతోపాటు చెస్ క్రీడలో తనకంటూ ఒక ప్రతిభ చాటుకున్నారు. అయితే ఒక విషయంలో మిగతా నలుగురు ముందున్నారు. కానీ నారా లోకేష్ వెనుకబడి ఉన్నారు. అందుకే తనకు పెద్ద కష్టం వచ్చిందని చెప్పుకుంటున్నారు లోకేష్. అదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన బాధను పంచుకున్నారు.
* ఆలోచింపజేసిన పోస్ట్..
నిన్ననే ఒక్క పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో ( social media) లోకేష్.’ మా కుటుంబంలో మిగిలిన అందరూ ప్రతిష్టాత్మకమైన అవార్డులు గెలుచుకున్నారు. నేను మాత్రం వెనుకబడిపోయాను ‘ అంటూ ట్విట్ చేశారు. ‘తండ్రి ఎకనామిక్ టైమ్స్ ద్వారా బిజినెస్ రి ఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. అమ్మ గోల్డెన్ పీకాక్ అవార్డును ఇంటికి తీసుకొచ్చారు. నా భార్య భారత దేశంలోని బిజినెస్ లో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చేరారు. చివరికి మా అబ్బాయి కూడా చెస్ ఛాంపియన్.. ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం కంటే ముందు మా కుటుంబంతో పోటీపడి గెలవడమే కష్టమని తెలుసుకుంటున్నాను’ అని ట్రీట్ చేశారు నారా లోకేష్.
* పాలనలో తనదైన మార్క్..
సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి నారా లోకేష్ రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. వారికి దూరంగా ఉండే భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరూ వ్యాపార రంగంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ కుటుంబంలో జన్మించిన దేవాన్స్ కూడా వారి కంటే ఏమాత్రం తీసుకోను అన్నట్టు చెస్ ఛాంపియన్గా నిలిచారు. వారందరితో పోల్చుకుంటే వెనుకబడిపోయాను అన్నది లోకేష్ భావనగా తెలుస్తోంది. అయితే సుదీర్ఘకాలం పాదయాత్ర చేసి ఏపీ ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు లోకేష్. ఆపై రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంతో పాటు పాలనలో సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు లోకేష్. వీటి కంటే అవార్డులు గొప్ప కాదు కానీ.. కుటుంబ సభ్యులు వాటిని దక్కించుకోవడంతో ఆనందంగా ఈ విషయాన్ని చెబుతున్నారు.