https://oktelugu.com/

Nara Lokesh : ఫాఫం లోకేష్.. మరీ చీప్ కోడిగుడ్లతో దాడి చేస్తారా? ఏంటి అవమానం?

లోకేష్ కూడా పాదయాత్ర చేస్తున్నాడు. కానీ జనాలు ఏరీ.. అంతా డంబాచారం.. ఎవ్వరూ లేకపోతే టీడీపీ నేతలే వచ్చి తిరుగుతున్నారు. లోకేష్ కోసం అంతా సెటప్ చేస్తున్నారు. కూరగాయాలు అమ్మేవారిని, రైతులను పట్టుకొచ్చి వారితో కష్టసుఖాలు చెప్పి డబ్బులిచ్చి పంపిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 2, 2023 / 10:08 AM IST
    Follow us on

    Nara Lokesh : యువగళం పాదయాత్రలో టీడీపీ లీడర్ నారా లోకేష్ కు చేదు అనుభవం ఎదురైంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ యువకుడు లోకేష్ పై కోడిగుడ్లతో దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ లీడర్లు యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. లోకేష్ పై కోడిగుడ్ల దాడితో అక్కడ హైటెన్షన్ నెలకొంది. కత్తులో.. కటార్లతో దాడి చేస్తే సింపతీ వచ్చి ఓట్లు పడేవని.. మరీ చీప్ గా కోడిగుడ్లతో దాడి చేయడం ఏంటని లోకేష్ వాపోయినట్టు సమాచారం. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.

    ఇక లోకేష్ ను దాడి చేయాలంటే కూడా సిగ్గుపడిపోయారు ఆయన ప్రత్యర్థులు. జగన్ పై కోడికత్తిపై దాడి చేసి ఆయనను అంతమొందించాలని పెద్ద పెద్ద స్కెచ్చులు వేసిన ప్రత్యర్థులు లోకేష్ ను మాత్రం మరీ చీప్ గా కోడిగుడ్లతో దాడి చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ‘నేను అంత చీపా?’ అని సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలుస్తోంది.

    ‘కొట్టడానికైనా.. కొట్టించుకోవడానికైనా ఓ అర్హత ఉండాలి’. అది ఇప్పుడు మన లోకేషం బాబులో లేవని అర్థమైపోయింది. పగోడిని చంపాలంటే ఎవరైనా కత్తులు, కటార్లు వాడుతుంటారు. కానీ మన లోకేష్ కోసం ఇవేవీ అవసరం లేదని జనాలు పగోళ్లు డిసైడ్ అయిపోయారు. మరీ చీప్ గా కోడిగుడ్లతో దాడి చేసి లోకేష్ ను అవమానించారు. లోకేష్ బాబును మరీ వెర్రి వెంగళప్పలా చూస్తున్నారు. కనీసం మా లోకేష్ బాబు దాడి చేసుకోవడానికి కూడా అర్హత లేదా? అన్నట్టుగా మారింది.

    అప్పట్లో వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్న రోజులు అవీ.. పాదయాత్ర చేస్తుంటే జన ప్రభంజనం కనిపిస్తోంది. ఎటూ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం. అంతమందిలో అలా నడవాలంటే గట్స్ కావాలి. ప్రత్యర్థులు పగోళ్లు కాపు కాస్తుంటారు.అయినా కూడా జనం కోసం జగన్ నడిచారు. ఆ జనమే ఆయనకు కాపు కాశారు. రక్షణగా నిలిచారు.

    మన లోకేష్ కూడా పాదయాత్ర చేస్తున్నాడు. కానీ జనాలు ఏరీ.. అంతా డంబాచారం.. ఎవ్వరూ లేకపోతే టీడీపీ నేతలే వచ్చి తిరుగుతున్నారు. లోకేష్ కోసం అంతా సెటప్ చేస్తున్నారు. కూరగాయాలు అమ్మేవారిని, రైతులను పట్టుకొచ్చి వారితో కష్టసుఖాలు చెప్పి డబ్బులిచ్చి పంపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అస్సలు జనాదరణ లేదని వీడియోలు, ఫొటోలను వైసీపీ నేతలు చూపిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఓ ప్రతిపక్షనేతపై కోడిగుడ్ల దాడితో లోకేష్ కు జనాల్లో అంతా స్కోపు లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.