Nara Lokesh America Visit: అమెరికాలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh). అక్కడ తెలుగువారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వెళ్లిన ప్రతి చోటా నారా లోకేష్ కు ప్రవాస ఆంధ్రులు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ పర్యటన సాగుతుండగా.. అక్కడి తెలుగు ప్రజలు మాత్రం ఇంటికి అతిధి వచ్చినట్టుగా గౌరవ మర్యాదలు ఇస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ పర్యటన ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతోంది. ఐదు రోజులపాటు లోకేష్ అక్కడే ఉండనున్నారు. అయితే ఎటువంటి సమీకరణ చేయకుండానే తెలుగు వారు ఎక్కువగా లోకేష్ వద్దకు వస్తుండడం విశేషం. సాధారణంగా మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి స్థాయి నేతలు వెళితే అక్కడ నివసించే తెలుగు వారు స్వాగతం పలుకుతుంటారు. కానీ లోకేష్ మంత్రి స్థాయిలోనే అక్కడి ప్రజలను ఆకర్షించగలుగుతున్నారు. ఆయనే ఆశ్చర్యపోయే విధంగా కుటుంబాలతో సహా తెలుగు వారు స్వాగతం పలికేందుకు ముందుకు రావడం విశేషం.
* స్పష్టమైన అవగాహన..
సాధారణంగా అమెరికాలో( America) స్థిరపడేవారు విద్యాధికులు. సమాజం పట్ల అవగాహన ఉన్నవారు. వారికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండదు కూడా. వారు ఖండాంతరాల్లో ఉన్న ఏపీలో ఏం జరుగుతోంది అన్నది తెలుసుకుంటారు. గడిచిన 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వ పాలన, రాష్ట్ర అభివృద్ధి పై సమగ్ర వివరాలు వారి వద్ద ఉంటాయి. అయితే ఈ పరిణామాల క్రమంలో లోకేష్ పాత్ర వారికి తెలుసు. అయితే ఇప్పుడు ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు లోకేష్ అమెరికాలో అడుగు పెట్టారు. గత పర్యటనలో గూగుల్ సంస్థ ప్రతినిధులను కలిశారు. దాని పర్యవసానమే విశాఖకు అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ రాక. మరోవైపు ప్రపంచ దిగ్గజా ఐటీ సంస్థలు అన్ని ఏపీ వైపు చూస్తున్నాయి. దీని వెనుక లోకేష్ కృషి ఉంది. ఆ కృషిని ఏపీలో ప్రతిపక్షాలు గుర్తించకపోవచ్చు కానీ.. అమెరికాలో ఉన్న తెలుగు వారు మాత్రం గుర్తించారు. అందుకే లోకేష్ ను సాదరంగా ఆహ్వానిస్తున్నారు.

* వారసత్వంగా రాజకీయాల్లోకి..
స్వతహాగా లోకేష్ విద్యాధికుడు. తండ్రి చంద్రబాబు( CM Chandrababu) మూలంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రత్యర్థులు కూడా లోకేష్ ను శత్రువులుగా చూశారు. అయితే విదేశాల్లో చదువుకున్న లోకేష్ ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు చాలా సమయం పట్టింది. అయితే తన శరీర ఆకృతి తో పాటు ఇక్కడి పరిస్థితులను ఆకలింపు చేసుకున్నారు లోకేష్. పరిపూర్ణత కలిగిన రాజకీయ నాయకుడిగా.. ఆపై పాలకూడిగా తన ముద్ర చాటుతున్నారు. అందుకే ప్రపంచమే ఇప్పుడు ఆయనను గుర్తిస్తుంది. ప్రపంచ అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా పర్యటనకు ఒక సామాన్య మంత్రి వెళితే.. భారీ స్థాయిలో ఆదరణ దక్కింది. తెలుగు ప్రజలంతా ఆత్మీయ స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రధారణలో అక్కడకు వచ్చి లోకేష్ తో కరచలనం చేసేందుకు పోటీపడ్డారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. శ్వేత జాతీయలు సైతం ఆశ్చర్యపోయేలా అక్కడి తెలుగువారు లోకేష్ ను తమ రాష్ట్ర నాయకుడిగా పరిచయం చేశారు. ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తానికైతే లోకేష్ పర్యటన తొలిరోజు అదుర్స్.
