Nara Lokesh America Tour: ఆంధ్రప్రదేశ్ కు( Andhra Pradesh) పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయి. ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ చొరవ అభినందనీయం. ఆయన తరచూ విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు. అదే సమయంలో విదేశాల్లో స్థిరపడిన ఎన్నారై లను కలిసి పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పిస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి అమెరికా పర్యటనకు వెళ్ళనున్నారు మంత్రి నారా లోకేష్.
* పెట్టుబడుల అన్వేషణ..
కూటమి( Alliance) అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు దావోస్కు వెళ్లారు. ఆపై అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలకు సైతం వెళ్లారు నారా లోకేష్. అక్కడ ప్రవాస ఆంధ్రుల సహకారంతో పారిశ్రామికవేత్తలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. దిగ్గజ సంస్థల ప్రతినిధులను కలిశారు. వారితో ఒప్పందాలు కంటే నేరుగా వచ్చి పెట్టుబడులు పెట్టే విధంగా వారితో సానుకూలమైన చర్చలు జరుపుతున్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున వారికి సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. భూముల కేటాయింపు తో పాటు కొన్నిరకాల రాయితీలు ఇస్తున్నారు. అయితే గతంలో సైతం ఇదే మాదిరిగా ప్రభుత్వాలు వ్యవహరించి ఉంటే ఏపీ ఇప్పటికే పారిశ్రామికంగా గణనీయమైన అభివృద్ధి సాధించేది.
* 6 నుంచి విస్తృత పర్యటన..
నారా లోకేష్( Nara Lokesh) ఈనెల 6న అమెరికా వెళ్ళనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ టార్గెట్ గా పావులు కదపనున్నారు. 6న డల్లాస్ లో పారిశ్రామిక వర్గాలతో సమావేశం నిర్వహించనున్నారు. 8,000 మందితో గార్ల్యాండ్లో సభ నిర్వహించనున్నారు. 8న శాన్ ఫ్రాన్సిస్కో లో పర్యటించనున్నారు. ఏపీకి పెట్టుబడుల కోసం లోకేష్ కాలికి బలపం కట్టుకుని విదేశాలకు తిరుగుతున్నారు. అయితే మాటలతోనే ప్రతిపక్షాలకు సమాధానం చెబుతున్నారు. గతంలో దావోస్ పర్యటనతో పాటు లోకేష్ లండన్ పర్యటనను ఉద్దేశించి విపక్షం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేసింది. ఏం ఒప్పందాలు చేసుకున్నారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. కానీ ఏకంగా గూగుల్ డేటా సెంటర్ ను విశాఖకు రప్పించి అందరికీ సమాధానం చెప్పారు లోకేష్. అందుకే ఇప్పుడు లోకేష్ విదేశీ పర్యటన అంటేనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకరకమైన వణుకు ఉంది.
* సానుకూలత పెంచుకుంటున్న లోకేష్..
అయితే విద్యావంతులతో పాటు సమాజం పై అవగాహన ఉన్నవారు మాత్రం లోకేష్ చర్యలను మెచ్చుకుంటున్నారు. గతంలో లోకేష్ పై విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేసేవారు సైతం ఆలోచన చేస్తున్నారు. దానికి కారణం లోకేష్ పని తీరు. ఎక్కడ ప్రకటనలకు పోకుండా.. అతిగా ప్రకటనలు చేయకుండా లోకేష్ తన పని తాను చేసుకుంటున్నారు. ఏపీకి భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆయన అమెరికా పర్యటన కూడా భారీ వ్యూహంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పని జరిగిన తరువాతే ప్రకటన అన్నట్టు లోకేష్ అలవాటు చేసుకున్నారు. చూడాలి లోకేష్ అమెరికా పర్యటన ఏపీకి ఏ స్థాయి పెట్టుబడులు తీసుకురాగలదో..