Vijayasai Reddy
Vijaysai Reddy : అనుమానాలే నిజమవుతున్నాయా? అధికారం కోల్పోయిన వైసీపీకి పెద్ద దెబ్బ తగలబోతోందా? కేంద్రంలో తిరుగులేకుండా ఉన్న బీజేపీలోకి ఓ వైసీపీ బిగ్ లీడర్ చేరబోతున్నాడా? అంటే ఔననే సమాధానం వస్తోంది. అక్కడ ఢిల్లీలో.. ఇక్కడ ఆంధ్రాలో రాజకీయాలను షేక్ చేసే ఓ పెద్ద పరిణామం చోటుచేసుకోబోతోంది. ఇది ఏపీ రాజకీయాలకు ఓ కుదుపు కుదపడం ఖాయంగా కనిపిస్తోంది.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు రైట్ హ్యాండ్ గా ఉంటూ.. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి వెన్నుదన్నుగా నిలిచిన విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొద్ది సేపటి క్రితమే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ట్విట్టర్ లో సంచలన ప్రకటన చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తదీన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరనని అంటున్నా ఆయన బీజేపీకి దగ్గర అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బీజేపీ పెద్దలు విజయసాయిరెడ్డి కి అత్యున్నత పదవి ఇచ్చి లాగేసేందుకు చూస్తున్నారని.. కేంద్రంలో విజయసాయిరెడ్డికి కీలక పాత్రను పోషించబోతున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి.
సంకీర్ణ సర్కారుగా కొనసాగుతున్న బీజేపీకి కేంద్రంలో బలమైన నేతల కొరత ఉంది. ఆలోటును పూడ్చేందుకే ‘జై శంకర్ ’ లాంటి అధికారులను తీసుకొచ్చి విదేశాంగ శాఖలు అప్పగించింది. అయితే స్వతహాగా మంచి మాటకారి, రాజకీయ పరిణతి, ఒక ఉన్నత అధికారి అయిన విజయసాయిరెడ్డి లాంటి పవర్ ఫుల్ వ్యక్తులు కావాలని యోచిస్తున్న బీజేపీ ఆయన్ను తమ పార్టీలో కలుపుకొని కేంద్రమంత్రిగా కీలక రోల్ అప్పగించబోతున్నట్టు సమాచారం.
ఈ మేరకు విజయసాయిరెడ్డిని ఎలాగైనా బీజేపీలో చేర్పించే ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయని.. ఆయన వైసీపీని వీడి బీజేపీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి.. ఇదే జరిగితే వైసీపీకి పెద్ద దెబ్బగా భావించవచ్చు. అధికారం కోల్పోయిన పార్టీకి విజయసాయిరెడ్డి గనుక పోతే ఇక ఆ పార్టీ కోలుకోవడం కష్టమేనని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.
రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను.
ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు.
ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు.…
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 24, 2025