MP Midhun Reddy on EVMs: రాహుల్ గాంధీ( Rahul Gandhi) దేశంలో ఓట్ల చోరీ జరిగిందని చెబుతున్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణను వ్యతిరేకిస్తున్నారు. దాని గురించి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డెసిషన్ ఏంటనేది అంతా చర్చ జరుగుతోంది. ఇటువంటి సమయంలో పార్లమెంటులో ఆ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం జాతీయస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నవ్వుల పాలు చేశాయి. మొన్నటి ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎంపీగా గెలిచారు మిధున్ రెడ్డి. అయితే నిన్న పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ తాను మూడుసార్లు ఎంపీగా గెలిచానని.. కానీ తమకు ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని సందేహం వ్యక్తం చేశారు. దీంతో పార్లమెంటులో ఉన్న మిగతా ఎంపీలంతా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి వైపు ఆసక్తిగా చూడడం కనిపించింది. మూడుసార్లు ఈవీఎంలపై గెలిచిన మీకే అనుమానం ఉంటే ఎలా అన్నట్టు వారంతా ఆశ్చర్యంగా చూశారు. ఓటరు జాబితా సవరణ పై మాట్లాడుకుంటా.. ఈవీఎంలపై వ్యాఖ్యానించడం ఏంటనేది వారి సందేహం.
అప్పట్లో అనుమానం లేదట..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ 2019లో ఘనవిజయం సాధించింది. 151 సీట్లలో బంపర్ మెజారిటీ పొందింది. ప్రతి నియోజకవర్గ నుంచి అభ్యర్థులు దాదాపు గెలిచినంత పని అయింది. టిడిపి గెలుస్తాం అనుకున్న సీట్లు కూడా చేజారిపోయాయి. దాదాపు మంత్రులంతా ఓడిపోయారు. కానీ అప్పట్లో ఈవీఎంలపై టిడిపి అనుమానం వ్యక్తం చేసింది. జాతీయస్థాయిలో సైతం దీనిపై పోరాటాలు చేసింది. అయితే అది సహజంగానే ఎన్నికల స్టంట్ అంటారు. ఓడిపోయిన పార్టీ నిలబడేందుకు రకరకాల మాటలు చెబుతుంది అంటారు. అది వాస్తవం కూడా. అయితే ఇక్కడ పాయింట్ అది కాదు. తాను ఈవీఎంల తో గెలిచానని.. కానీ అదే ఈవీఎంలపై తనకు సందేహాలు ఉన్నాయంటూ మిధున్ రెడ్డి చెప్పుకోవడం మాత్రం నిజంగా హాస్యాస్పదం. పార్లమెంటులో తెలుగు ఎంపీ పరువు పోయినంత పని అయింది.
ఒక్కసారిగా షాక్..
ఇదే సభలో రాహుల్ గాంధీ ఓట్ల చోరీపై మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు ఓటరు జాబితా సవరణ పై మాట్లాడుతున్నాయి. అయితే నా రూటు సెపరేట్ అన్నట్టు వ్యవహరిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఓటరు సవరణ జాబితా పై కనీసం స్పందించలేదు మిధున్ రెడ్డి. దానిపై మాట్లాడుతున్నారు అని భావిస్తోంది విపక్షం. ఇండియా కూటమియంత మిధున్ రెడ్డి ఏం మాట్లాడుతారని ఆశగా ఎదురు చూస్తుండగా.. ఈవీఎంలపై మాట్లాడేసారు మిధున్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ మారదు గాక మారదు అని.. ఎన్డీఏ వ్యతిరేక పార్టీలన్నీ ఒక నిర్ణయానికి వచ్చేసాయి. ఆ పార్టీని నమ్ముకుంటే నట్టేట మునిగినట్టేనని వ్యాఖ్యానించేదాకా పరిస్థితి వచ్చింది. జాతీయస్థాయిలో ఇతర పార్టీల అవసరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ బిజెపికి వ్యతిరేకంగా పార్టీ మాట్లాడలేదు. కనీసం ఇతర పార్టీలకు మద్దతు తెలపలేదు.