Monsoons: ఏపీలో( Andhra Pradesh) భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదే సమయంలో వర్షాలు సైతం కొనసాగుతున్నాయి. వర్షాలు పడుతున్న ప్రాంతంలో చల్లటి వాతావరణం ఉంది. మిగతా ప్రాంతాల్లో మాత్రం భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ప్రజలు విలవిలలాడుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వాతావరణ శాఖ మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈసారి వర్షాకాలం ముందే రానున్నట్లు స్పష్టం చేసింది. ఈ నెలాఖరుకు నైరుతి రుతుపవనాలు కేరళకు పాకనున్నట్లు పేర్కొంది. రానున్న రెండు రోజుల్లో ఏపీలోని అన్ని జిల్లాలకు వర్ష సూచన వచ్చింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే గతానికి భిన్నంగా వేసవిలోనే నైరుతీ రుతుపవనాల రాక ప్రారంభం కావడం విశేషం.
Also Read:ఇక మొత్తం మహీంద్రా కార్లే ఉంటాయేమో.. మార్కెట్లోకి మరో మూడు మోడల్స్
* మూడు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులకు..
సాధారణంగా జూన్ మొదటి వారంలో( June first week ) రుతుపవనాల రాక ప్రారంభం అవుతుంది. అయితే మరో మూడు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు తాకనున్నట్లు తెలుస్తోంది. మే 27న కేరళను రుతుపవనాలు తాకుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం అంచనాకు మాదిరిగా రుతుపవనాలు కేరళ ను చేరితే.. 2009 తర్వాత తొలిసారి వర్షాకాలం ముందుగానే వస్తున్నట్లు భారత వాతావరణ శాఖ చెబుతోంది. 2009లో మే 23న నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. సాధారణంగా జూన్ ఒకటో తేదీ వరకు కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం లేదు. కానీ ఈ ఏడాది నాలుగు రోజులు ముందే రుతుపవనాలు కేరళ తీరానికి తాకుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వీటి ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది.
* దేశవ్యాప్తంగా విస్తరణ..
అయితే మే 27న రుతుపవనాల రాక ప్రారంభం అవుతుంది. జూలై 8 లోగా దేశవ్యాప్తంగా ఆ రుతుపవనాలు విస్తరిస్తాయి. సెప్టెంబర్ 17 నుంచి ఆగ్నేయ దిశ నుంచి తిరోగమనం అవుతాయి. అక్టోబర్ 15వ తేదీ లోగా పూర్తిగా ఆ రుతుపవనాలు వెళ్ళిపోతాయి. 2025 వర్షాకాలంలో సాధారణం కంటే అధికంగానే వర్షం కురుస్తుందని ఏప్రిల్లో భారత వాతావరణ సంస్థ ప్రకటించింది. ఎల్ నివో పరిస్థితులు ఉండబోవని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈసారి నాలుగు నెలల్లో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేయడం విశేషం. అయితే గతం కంటే వర్షాలు పడతాయని చెబుతుండడం పై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
* రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
ప్రస్తుతం శ్రీకాకుళం( Srikakulam) నుంచి అనంతపురం వరకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 45 డిగ్రీలకు పైగా నమోదవుతూ వస్తున్నాయి. మరోవైపు అగ్ని కార్తెలు ప్రారంభం కానుండడంతో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. అయితే అంతకంటే ముందే రుతుపవనాల రాకతో వర్షాలు కూడా ప్రారంభం అవుతాయని వాతావరణ శాఖ ఒక అంచనాకు వచ్చింది. అదే జరిగితే గతం కంటే వేసవి తీవ్రత తగ్గే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.