Homeఆంధ్రప్రదేశ్‌PM Modi: తెలుగు రాష్ట్రాలకు గొప్ప వరాలు ఇస్తున్న మోడీ.. లిస్ట్ లో ఏమేం ఉన్నాయంటే?

PM Modi: తెలుగు రాష్ట్రాలకు గొప్ప వరాలు ఇస్తున్న మోడీ.. లిస్ట్ లో ఏమేం ఉన్నాయంటే?

PM Modi: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఐదు నెలలైంది. మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడింది. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డును మోదీ సమం చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి ప్రజల సమస్యలు, సదుపాయాలపై కేంద్రం దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే బడ్జెట్‌లో అనేక వరాలు ప్రకటించింది. ఇందులో భాగంగా తాజాగా మౌలిక సదుపాయాల కల్పనపై ఫోకస్‌ పెట్టింది. పలు రాష్ట్రాల్లో రోడ్లు, రైలు, పోర్టు కనెట్టివిటీ పెంచాలని నిర్ణయించింది. దాదాపు 60 వేల కిలోమీటర్ల మేర నిర్మాణాలకు ప్రణాళిక సిద్ధం చేసింది. విజన్‌ 20247లో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులతో ఏపీతోపాటు తెలంగాణకు ప్రాధాన్యత దక్కింది.

నూతన ప్రణాళికలివీ..
కేంద్రం తాజాగా ఖరారు చేసిన హైస్పీడ్‌ కారిడార్లలో ఏపీ–తెలంగాణ మీదుగా పలు ప్రాజెక్టులకు స్థానం కల్పించింది. రెండు తెలుగు రాస్ట్రాలను అనుసంధానం చేసేలా ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రోడ్లను విస్తరించడంతోపాటు అంతర్గత రోడ్ల అనుసంధానానికి నిధులు కేటాయించింది. కేంద్రం ఖరారు చేసిన హై స్పీడ్‌ కారిడార్లలో ఏపీకి 9, తెలంగాణకు 6 ప్రాజెక్టులు దక్కాయి. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయనున్నారు. వీటిని రెండు దశల్లో పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది.

తెలుగు రాష్ట్రాలకు ఇవీ..
ఇక కేంద్ర హైస్పీడ్‌ ప్రాజెక్టులకు సంబంధించిన అంచాలపై కసరత్తు పూర్తి చేశారు. అయితే అధికారికంగా ఈ ప్రాజెక్టు రూట్‌ మ్యాప్‌తోపాటు భూ సేకరణపై నిర్ణయం తీసుకోనున్నారు. తాజా ప్రాజెక్టులక సంబంధించి రెండు సంస్థల నుంచి కేంద్రం నివేదికలు సేకరించింది. మొత్తంగా దాదాపు 60 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి అనుగుణంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత అవసరాలతోపాటు భవిష్యత్‌ రద్దీకి అనుగుణంగా ప్రణాళికలపై కసరత్తు సాగుతోంది. 2047 లోగా వీటి నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలో హైదరాబాద్‌ నుంచి రాయపూర్‌ వరకు హైస్పీడ్‌ కారిడార్‌ రానుంది. అదేవిధంగా నాగపూర్‌ – హైదరాబాద్‌ ప్రతిపాదన మరొకటి. హైదరాబాద్‌–విశాఖపట్నం వరకు మరో ప్రతిపాదన సిద్ధం చేశారు.

పోర్టు కనెక్టివిటీ
పోర్టు కనెక్టివిటీల్లో ఏపీకి ప్రాధాన్యం దక్కింది. అందులో హైదరాబాద్‌ – బెంగళూరు ప్రతిపాదించిన మార్గం ఏపీలో 261 కి.మీ వరకు ఉంటుంది. ఖరగ్‌పూర్‌–కటక్‌–విశాఖపట్నం మార్గం ఒడిశా మీదుగా ఏపీ వరకు వస్తుంది. చౌటుప్పల్‌ ఎన్‌హెచ్‌–65 నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు మరో ప్రతిపాదన సిద్ధమైంది. ఏపీ పరిధిలో 335 కిలోమీటర్ల మేర అతిపెద్ద హైస్పీడ్‌ కారిడార్‌ వైజాగ్‌–కాకినాడ–రామేశ్వరం–విజయవాడ–గుంటూరు–ఒంగోలు వరకు ఏర్పాట దిశగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కాకినాడ పోర్టునుంచి ఉప్పాడ బీచ్, నెల్లూరు సిటీ నుంచి కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు నుంచి తంగలం, సూళ్లూరిపేట–మోమిడి వరకు రోడ్ల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version