Minister Nara Lokesh : మంత్రి నారా లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. తన మనసులో ఉన్న బాధను వ్యక్తపరిచారు. టిడిపి కార్యకర్త మరణం పై స్పందించారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గొర్రెపాడు కు చెందిన గుంటూరు శ్రీను ఐ టి డి పి కార్యకర్త. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏమైందో ఏమో కానీ శనివారం ఉదయం ఇంటిదగ్గర గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు చిలకలూరిపేటలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నారా లోకేష్ అలర్ట్ అయ్యారు. స్థానిక టిడిపి నేతలకు సూచించడంతో వారు హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్య చికిత్సలు అందిస్తుండగా శ్రీను ప్రాణాలు కోల్పోయాడు. శ్రీను భౌతిక కాయం పై టిడిపి జెండా కప్పి స్వగ్రామానికి తరలించారు.ఆదివారం అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే శ్రీను అకాల మరణాన్ని తట్టుకోలేకపోయారు మంత్రి నారా లోకేష్. ఎమోషనల్ ట్వీట్ చేశారు.
* ఎంత పని చేసావు శీను
అందరి కష్టాల గురించి తన దృష్టికి తెచ్చే శ్రీను.. తన కష్టం గురించి మాత్రం ఎప్పుడూ చెప్పలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు లోకేష్. ఇలా ఆత్మహత్య చేసుకుని పార్టీకి, తనకు తీరని లోటు మిగిల్చావ్ అంటూ బాధపడ్డారు. శ్రీను మరణం తనను ఎంతగానో బాధించిందని ట్విట్టర్లో పేర్కొన్నారు.’ అన్నా అన్నా అని పిలిచే వాడివి. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసే వాడివి. నా పుట్టినరోజు, పెళ్లిరోజులను ఓ పండగలా జరిపే వాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు. ఐ మిస్ యు. ఆత్మాభిమానం ఉండొచ్చు. ఆత్మహత్య చేసుకునే అంతగా కాదు. నువ్వు బలవన్మరణానికి పాల్పడిన విచారకర సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న. నిన్ను బతికించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. సారీ శీను. నీకు కలిగిన నష్టమేంటో ఏ రోజు నాకు తెలియనివ్వలేదు’ అంటూ ఎమోషనల్ అయ్యారు నారా లోకేష్.
* లోకేష్ ప్రత్యేక విజ్ఞప్తి
నారా లోకేష్ ఇటీవల టిడిపి శ్రేణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. ఐ టి డి పి కార్యకర్త శీను ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ప్రత్యేక విజ్ఞప్తి చేశారు లోకేష్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్తులకు నా విన్నపం. ఎటువంటి సమస్యలున్నా స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. అంతేకానీ ఆత్మహత్య చేసుకోకండి అంటూ పిలుపునిచ్చారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం ఉంటుందని చెప్పుకొచ్చారు.
అన్నా.. అన్నా… అని పిలిచేవాడివి. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి. నా పుట్టినరోజు, పెళ్లి రోజులను ఓ పండగలా జరిపేవాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు. ఐ మిస్ యూ.
ఆత్మాభిమానం ఉండొచ్చు.… pic.twitter.com/gpGa54kqMw
— Lokesh Nara (@naralokesh) December 1, 2024