https://oktelugu.com/

Minister Lokesh : సత్య నాదెళ్ళను కలిసిన లోకేష్.. ఏపీకి మైక్రోసాఫ్ట్?

కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటుతోంది. పాలనపై దృష్టి పెట్టారు చంద్రబాబు. అటు డిప్యూటీ సీఎం పవన్ సైతం వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. అదే సమయంలో ఏపీకి పరిశ్రమలు తేవాలని లోకేష్ ప్రయత్నాలు ప్రారంభించారు.

Written By:
  • Dharma
  • , Updated On : October 29, 2024 / 12:58 PM IST

    Minister Lokesh

    Follow us on

    Minister Lokesh :  అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు మంత్రి నారా లోకేష్. గత కొద్ది రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశం అయ్యారు.గంటకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. ఏపీ అభివృద్ధికి సహకారం అందించాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఐటి, ఏఐ, నైపుణ్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు తీసుకొచ్చిన పాలసీల గురించి వివరించే ప్రయత్నం చేశారు నారా లోకేష్. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్లు వస్తే ఏపీ మరింత అభివృద్ధి చెందడమే కాదు.. యువతకు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాన్సెప్టును తీసుకొచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. డిజిటల్ గవర్నెన్స్, లాజిస్టిక్ లకు ఏపీ అనువుగా ఉంటుందన్న విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అందుకే మైక్రోసాఫ్ట్ సహకారం కోరుతున్నామని.. అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు మంత్రి లోకేష్. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సత్యా నాదేళ్లకు విజ్ఞప్తి చేశారు. అయితే లోకేష్ చెప్పిన విషయాలను సావధానంగా విన్నారు సత్య నాదెళ్ల.నాడు హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ కంపెనీ రావడానికి కృషిచేసిన చంద్రబాబు ప్రస్తావన కూడా వారి మధ్య వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే మైక్రోసాఫ్ట్ అధినేత సానుకూలంగా స్పందించారు.

    * వరుస సమావేశాలు
    అయితే వరుసగా లోకేష్ పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అవ్వడం విశేషం. అంతకుముందు టెస్లా సిఎఫ్ఓతో భేటీ అయ్యారు.ఏపీ వనరుల గురించి కూడా వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు ప్రత్యేకంగా అనంతపురం జిల్లా గురించి ప్రస్తావించారు. అక్కడ ఏర్పాటు అయినా కియో కార్ల పరిశ్రమ గురించి వివరించే ప్రయత్నం చేశారు. ప్రపంచంలోనే పేరు మోసిన 100 కంపెనీల ప్రతినిధులను కలవనున్నారు లోకేష్. మరికొన్ని రోజులపాటు ఆయన అమెరికాలోనే గడపనున్నారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో పరిశ్రమలు తీసుకురాలేదన్న విమర్శలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు లోకేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. ఏపీకి వీలైనన్ని ఎక్కువ పరిశ్రమలు తీసుకురావాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు.

    * ఎన్నారైల సందడి
    మరోవైపు అమెరికాలో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు పెద్ద ఎత్తున వచ్చి లోకేష్ ను కలుస్తున్నారు. అయితే గత మాదిరిగా ఎటువంటి హంగు ఆర్పాటం లేదు. ఎన్నారైల ఇంటి వద్ద ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలకు ఏపీ విషయాలను వివరిస్తున్నారు లోకేష్. ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల సందడి నడుస్తోంది.అయినా సరే లోకేష్ తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరి అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.