March Holidays 2026: పాఠశాలలకు( schools ) సెలవులు అంటే విద్యార్థుల్లో ఉండే సరదా వేరు. అందునా వేసవి సమీపిస్తుందంటే సెలవుల్లో ఎంచక్కా ఆటలు ఆడుకోవచ్చు.. బంధువుల ఇంటికి వెళ్లొచ్చు.. అన్న ధ్యాసతోనే ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. అటువంటి వారికి గుడ్ న్యూస్. మార్చిలో ఏకంగా 10 సెలవులతో పాటు ఒంటిపూట బడులు కూడా నడవనున్నాయి. అక్కడికి నెల రోజుల తర్వాత వేసవి సెలవులు మొదలుకానున్నాయి. ఇలా ఎలా చూసినా పిల్లలకు సెలవుల సందడి ఉంటుంది ఇక్కడి నుంచి. ఒకవైపు ఒంటిపూట బడులు.. మరోవైపు పండుగల సెలవు దినాలతో మార్చి నెల అంతా గడిచిపోనుందన్నమాట.
* ఏకంగా 10 రోజులకు పైగా..
వేసవి ప్రారంభంలో.. ఉష్ణోగ్రతలు ( temperatures ) భారీగా పెరుగుతున్న దృష్ట్యా ఒంటిపూట బడులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఓ పది రోజులపాటు సెలవు దినాలు ఉంటాయి. పండుగలతో పాటుగా వారాంతపు సెలవులను కూడా లెక్కలోకి తీసుకుంటే మార్చి నెలలు విద్యార్థులకు కనీసం పది రోజులు సెలవులు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
* మార్చి వస్తూ వస్తూ ఒకటో తేదీ ఆదివారం పడింది. ఆరోజు సెలవు దినం.
* మార్చి 4వ తేదీ హోలీ పండుగ. ఆరోజు కూడా సెలవు ఉంటుంది.
* మార్చి 14న రెండో శనివారం. ఆరోజు సైతం సెలవులు ఉంటాయి.
* మార్చి 19న ఉగాది పండుగ. ఆరోజు కూడా సెలవు.
* మార్చి 20న రంజాన్ పండుగ. ఆరోజు కూడా సెలవు ప్రకటిస్తారు.
* మార్చి 26న శ్రీరామనవమి. తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా సెలవు ఉంటుంది.
* మార్చి 31న మహావీర్ జయంతి. ఆరోజు కూడా అప్షనల్ హాలిడేగా ఇస్తారు. ఈ మార్చిలో ఐదు సెలవు దినాలుగా ఉంటే. పండుగలతో పాటు రెండో శనివారం కలుపుకొని సగం రోజులు పాఠశాలలకు సెలవులు రానున్నాయి.
* ఒంటిపూట బడులు..
మార్చి 16 నుంచి తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఎప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలు ఉత్తర్వులు జారీచేసాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించనున్నారు. పదోతరగతి పరీక్షలు జరిగే కేంద్రాల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి తరగతులు నిర్వహిస్తారు. మార్చి 16 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.