https://oktelugu.com/

Mahesh babu : మొన్న సాయి తేజ్..నేడు మహేష్ బాబు..మాజీ సీఎం జగన్ ని చెడుగుడు ఆడేసుకున్నారుగా!

మహేష్ బాబు కి సంబంధించిన ఏఎంబీ థియేటర్స్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఇదే తరహా సెటైర్ పోస్ట్ పడింది. 'ప్రతీ సినిమా లవర్ వెనుక ఒక పఫ్' ఉంటుంది అంటూ ఒక పోస్ట్ పెట్టారు. ఇది కచ్చితంగా సీఎం జగన్ ని ఉద్దేశించి పెట్టిందే అని సోషల్ మీడియా లో అందరికీ అర్థం అవ్వడంతో ఆ ట్వీట్ కి మంచి రీచ్ వచ్చింది

Written By:
  • Vicky
  • , Updated On : August 29, 2024 / 09:28 PM IST

    Maheshbau-Jagan

    Follow us on

    Mahesh babu : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో తెలుగు సినీ పరిశ్రమ ఎంత ఇబ్బందులకు గురైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక వ్యక్తి మీద కక్ష్యతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసాడు జగన్. టికెట్ రేట్స్ విషయంలో సరికొత్త జీవో ని తీసుకొచ్చి స్టార్ హీరోల సినిమాల వసూళ్లకు గండికొట్టే ప్రయత్నం చేసాడు. ముఖ్యంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో ని కలెక్టర్లు తూచా తప్పకుండ వ్యవహరించిన చిత్రాలు ‘భీమ్లా నాయక్’, ‘పుష్ప’. ఈ రెండు చిత్రాలకు ఆంధ్ర ప్రదేశ్ లో జీవో రేట్స్ కారణంగా దారుణమైన నష్టం జరిగింది. 130 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాల్సిన భీమ్లా నాయక్ చిత్రం కేవలం 97 కోట్ల రూపాయిల షేర్ దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. అలాగే తెలుగు వెర్షన్ లోనే 150 కోట్ల రూపాయిలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సిన పుష్ప చిత్రం, కేవలం 110 కోట్ల దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది.

    ప్రపంచవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లోనూ, అన్ని భాషల్లోనూ బంపర్ గా నిల్చిన పుష్ప చిత్రం, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఘోరమైన ఫ్లాప్ గా మిగలాల్సి వచ్చింది. అందుకు కారణం ప్రభుత్వం జారీ చేసిన జీవోనే. ఈ జీవో రేట్స్ మార్చాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా జగన్ ని కలిసి ప్రాధేయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనతో పాటుగా మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి కూడా వచ్చారు. ఇంతలా ఇబ్బంది పెట్టిన జగన్, ఇప్పుడు పదవి నుండి తప్పుకోవడం తో సినీ ఇండస్ట్రీ లో ఒక్కొక్కరు జగన్ మీద ఉన్న కోపాన్ని బయటపెడుతున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ ఫోటోని ట్విట్టర్ లో అప్లోడ్ చేస్తూ ‘ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు సురక్షితమైన హస్తాల్లోకి వెళ్ళింది’ అంటూ ట్వీట్ వేసాడు. అయితే ఇటీవల ఒక్క ప్రాంతంలోని అన్న క్యాంటీన్ లో పరిశుభ్రత లేదు అంటూ వైసీపీ పార్టీ వారు సోషల్ మీడియా లో ఒక వీడియో ని అప్లోడ్ చెయ్యగా అది తెగ వైరల్ గా మారింది. దీనిపై సాయి ధరమ్ తేజ్ ని స్పందించాల్సిందిగా వైసీపీ పార్టీ అభిమానులు ఆయనని ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ వేశారు. దీంతో ఒక వైసీపీ అభిమానికి సాయి ధరమ్ తేజ్ సమాధానం ఇస్తూ ‘మీరు ఉండే చోట ఎగ్ పఫ్ లు తక్కువ ధరకే దొరుకుంటుందని ఆశిస్తున్నాను’ అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చాడు.

    దానికి రెండు రోజుల ముందు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘గత 5 సంవత్సరాలలో మాజీ సీఎం జగన్ కేవలం ఎగ్ పఫ్ లు తినేందుకు మూడు కోట్ల రూపాయిల ఖర్చు చేసారు’ అంటూ ఒక ప్రకటన చేసింది. దీని సెటైర్ గా సాయి ధరమ్ తేజ్ పై సమాధానం ఇచ్చాడు. ఈ ఘటన జరిగిన పక్క రోజే మహేష్ బాబు కి సంబంధించిన ఏఎంబీ థియేటర్స్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఇదే తరహా సెటైర్ పోస్ట్ పడింది. ‘ప్రతీ సినిమా లవర్ వెనుక ఒక పఫ్’ ఉంటుంది అంటూ ఒక పోస్ట్ పెట్టారు. ఇది కచ్చితంగా సీఎం జగన్ ని ఉద్దేశించి పెట్టిందే అని సోషల్ మీడియా లో అందరికీ అర్థం అవ్వడంతో ఆ ట్వీట్ కి మంచి రీచ్ వచ్చింది.