Lokesh Tweet On Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan), మంత్రి లోకేష్ మధ్య ఉన్న బంధం గురించి చెప్పనవసరం లేదు. ప్రతి సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ విషయంలో లోకేష్ తన కృతజ్ఞతలను చాటుకున్నారు. లోకేష్ విషయంలో పవన్ సైతం తన అభిమానాన్ని చూపిస్తుంటారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ఓజి చిత్రం విడుదల అయింది. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మరోవైపు ఈ సినిమాను చూసేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు సైతం క్యూ కడుతున్నారు. చిత్ర యూనిట్ తో పాటు హీరో పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
* ట్వీట్ లో ఇలా..
నారా లోకేష్ తన ట్వీట్ లో #og అంటే original Gangster.. కానీ మా పవన్ అన్న అభిమానులకు మాత్రం original God. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న #og సినిమా విడుదల సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు. సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. పవన్ ఫ్యాన్స్ లోకేష్ కి థాంక్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు.
* అది మొదలు..
అయితే పవన్ విషయంలో లోకేష్( Nara Lokesh) ఇలా స్పందించడం ఇది తొలిసారి కాదు. వైసిపి హయాంలో చంద్రబాబు అరెస్టుకు గురైన సంగతి తెలిసిందే. అసలు ఆధారాలు లేని కేసులు 52 రోజులపాటు ఆయనను రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ లోకేష్ కు అండగా నిలిచారు. నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించారు. అది మొదలు పవన్ కళ్యాణ్ తో లోకేష్ కు మంచి బంధం ఏర్పడింది. అప్పటినుంచి పరస్పరం గౌరవించుకుంటూ వస్తున్నారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన రోజు తన తండ్రి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కు సైతం పాదాభివందనం చేశారు. ఆయన వద్దని వారించినా లోకేష్ వినలేదు. పవన్ కళ్యాణ్ కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ చిత్రాల విడుదల సమయంలో సైతం ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతుంటారు. పవన్ అన్న అంటూ సంబోధిస్తూ తనలో ఉన్న అభిమానాన్ని చాటుకుంటారు లోకేష్. అయితే లోకేష్ విషయంలో జనసైనికులకు భిన్న అభిప్రాయాలు ఉన్నా.. తమ అధినేత పవన్ కళ్యాణ్ గౌరవించిన తీరు మాత్రం ఆకట్టుకుంటుంది.
#OG అంటే Original Gangster. మా పవన్ అన్న అభిమానులకు మాత్రం Original God. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న #OG సినిమా విడుదల సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు. సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #TheycalllHimOG @PawanKalyan pic.twitter.com/LFfUbabPvY
— Lokesh Nara (@naralokesh) September 24, 2025