Nara Lokesh’s vision : కళ్ళు ఉన్నవాడు ముందు చూస్తాడు. దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు. చదువుతుంటే దూకుడు సినిమాలో డైలాగ్ గుర్తుకొస్తుంది కదూ. అది సినిమా కాబట్టి సినిమాటిక్ రేంజ్ లోనే ఆ డైలాగ్ రాశారు. కానీ దాన్ని రియల్ లైఫ్ లోకి ఇంప్లిమెంట్ చేస్తే.. దానికి గనక రూపం ఉంటే.. అది కచ్చితంగా నారా లోకేష్ ను చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏపీ అభివృద్ధి విషయంలో నారా లోకేష్ విజన్ అలాగే ఉంది. ముందు చూపు, దీర్ఘకాలిక లక్ష్యాలు, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు, లక్షల కోట్ల పెట్టుబడులు, వేల ఉద్యోగాలు, ఆర్థికంగా స్థిరీకరణ, ఏపీకి మెరుగైన దిశ.. ఇప్పుడు ఇవే ఆయన ముందున్నాయి. వాటి కోసమే ఆయనను ముందు నడిచేలా చేస్తున్నాయి.
చేపలు, మటన్ దుకాణాలు, ఐ ప్యాక్ అదే ఆర్టిస్టులు.. ఐదేళ్లపాటు ఏపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అన్ని వనరులు ఉన్నప్పటికీ.. మెరుగైన సామర్థ్యం ఉన్న యువత ఉన్నప్పటికీ గడచిన ప్రభుత్వం ఏపీ అభివృద్ధిలో ముందడుగు వేయలేకపోయింది. కనీసం భవిష్యత్తు లక్ష్యాలను సైతం నిర్ధారించుకోలేకపోయింది. బటన్ నొక్కుడు.. ఉచిత పథకాలకు ప్రజలను అలవాటు చేసి బానిసలుగా మార్చింది. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో విఫలమైన ప్రభుత్వం.. ఉన్న పెట్టుబడులను కూడా బయటికి వెళ్లిపోయేలా చేసింది. అమర్ రాజా బ్యాటరీస్ ఉ దంతమే ఇందుకు బలమైన ఉదాహరణ. అమర్ రాజా బయటికి వెళ్లిపోవడంతో.. తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందడుగు వేసి తమ రాష్ట్రంలోకి ఆహ్వానించింది. అనేక రాయితీలు ప్రకటించి బ్రహ్మాండమైన సంస్థను ఏర్పాటు చేసేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్థలు ఏపీని కాదనుకొని వెళ్లిపోయాయి. చివరికి కియా లాంటి అంతర్జాతీయ కార్ల తయారీ పరిశ్రమ కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. ఇవన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించిన నారా లోకేష్.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన కార్యాచరణ మొదలుపెట్టారు. కీలకమైన ఐటీ శాఖను తన చేతుల్లోకి తీసుకొని ఏపీకి సరికొత్త దిశను చూపిస్తున్నారు.
ఇటీవల విశాఖపట్నంలో గూగుల్ సంస్థ లక్ష కోట్లకు మించిన వ్యయంతో ఏఐ ఆధారిత సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీనిని మనదేశంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విభాగంలో అతిపెద్ద పెట్టుబడి అని అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానిస్తోందంటే లోకేష్ స్టామినా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయితే అక్కడితోనే లోకేష్ ఆగిపోవడం లేదు. ఇప్పుడు ఆయన ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. అలాగని ఇదేదో ఆయన సొంతంగా వెళుతున్న పర్యటన కాదు. ఆస్ట్రేలియా హై కమీషనర్ పిలుపుమేరకు ఆయన అక్కడికి వెళ్లారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని, లెంగ్తి క్వశ్చన్ అని.. కోడి ఇప్పుడే గుడ్డు పెట్టిందని.. పొదగడానికి టైం పడుతుందని అని అనుకోకుండా ముందడుగు వేశారు.
ఏపీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులను ఆహ్వానించడానికి ఆయన ఆస్ట్రేలియా పర్యటనను ఉపయోగించుకుంటున్నారు. ఆస్ట్రేలియా – ఇండియా సీఈవో ఫోరం డైరెక్టరేట్ మెక్ కే తో లోకేష్ సిడ్నీలో సమావేశం అయ్యారు.. అంతేకాదు ఏపీ ఈడీబి, సిఐఐ, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహించే ఆస్ట్రేలియా – ఏపీ సీఈవో రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కృష్ణపట్నం, విశాఖపట్నం, అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని కోరారు. వచ్చే నెల 14, 15 తేదీలలో నిర్వహించే పార్టనర్ షిప్ సమ్మిట్ -2025 కు ఫోరం నాయకత్వంతో కలిసి హాజరవ్వాలని లోకేష్ విజ్ఞప్తి కూడా చేశారు. దీనిని బట్టి లోకేష్ ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నాయకుడు అనేవాడు ఇనుప కంచల మధ్య ఉండకూడదు. ప్రజలు తన ఇంటి ముందు నుంచి వెళ్లకుండా నిషేధాలు విధించకూడదు. అన్నింటికంటే పెట్టుబడులను రాకుండా వెళ్ళగొట్టకూడదు. గత ఐదేళ్లలో జరిగింది ఇదే. ఇప్పుడు జరుగుతోంది వేరే. అందుకు బలమైన నిదర్శనమే గూగుల్ డేటా సెంటర్. ఏపీ ఇప్పుడు ఇక్కడితోనే ఆగిపోయేలా లేదు. ఏపీని ఆగనిచ్చేలా లోకేష్ లేరు.
Touched down and straight to business over lunch with Jodi McKay – Director of the India-Australia CEO Forum. We walked down the Sydney harbor and had a great chat on strengthening #AndhraPradesh’s ties with Australia. We explored how AP can be the next big magnet for Aussie… pic.twitter.com/LvzQb2eENa
— Lokesh Nara (@naralokesh) October 19, 2025