Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh at Colombo Stadium: ఎక్కడ క్రికెట్ మ్యాచ్ ఉన్నా వాలిపోతున్న లోకేష్!

Nara Lokesh at Colombo Stadium: ఎక్కడ క్రికెట్ మ్యాచ్ ఉన్నా వాలిపోతున్న లోకేష్!

Nara Lokesh at Colombo Stadium: ఏపీ మంత్రి నారా లోకేష్( AP Minister Nara Lokesh) చర్యలు ప్రత్యర్థులకు సైతం అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన అన్ని రంగాల్లో పరిణితి సాధిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ఏకతాటిపై నడిపిస్తున్నారు. కూటమిని సమన్వయం చేసుకుంటున్నారు. కేంద్ర పెద్దలతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నారు. విదేశీ పెట్టుబడులను తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నారు. ఇన్ని జరుపుతున్నాయన.. క్రికెట్ విషయంలో కూడా తీసుకుంటున్న శ్రద్ధ అంతా కాదు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్లను వీక్షించేందుకు వెళ్తున్నారు. దేశ క్రీడాకారులతో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జై షా తో నిత్యం టచ్ లో ఉంటున్నారు. ఏపీలో క్రికెట్ అభివృద్ధికి కీలక చర్చలు జరుపుతున్నారు. నిన్న కొలంబోలో జరిగిన క్రికెట్ మ్యాచ్ ను వీక్షించారు. ఇండియన్ క్రికెట్ జెర్సీ తో అలరించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

క్రికెట్ కు పెరుగుతున్న ఆదరణ
ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు క్రికెట్( cricket) క్రీడకు మించినది భారత్ లో కనిపించడం లేదు. ఎంతో ఉజ్వల భవిత ఉంది. అందుకే ప్రపంచంలో మిగతా దేశాలు సైతం ఇప్పుడు క్రికెట్ క్రీడను ఎంచుకుంటున్నాయి. అయితే నవ్యాంధ్రప్రదేశ్లో క్రికెట్ అభివృద్ధిపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా క్రీడా మైదానాల అభివృద్ధి, క్రీడల ప్రోత్సాహం వంటివి పెద్ద ఎత్తున చేపడుతోంది. అమరావతిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ నిర్మించాలన్నది ఒక ప్రణాళిక. విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో జాతీయ క్రికెట్ అసోసియేషన్, అంతర్జాతీయ క్రికెట్ అసోసియేషన్ సహకారాలు అవసరం. అందుకే సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ క్రీడాకారులతో పాటు క్రీడా అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేక అనుబంధంతో ముందుకు సాగుతున్నారు.

జై షా తో సంబంధాలు..
అంతర్జాతీయ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా( jaisha) ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో మంత్రి నారా లోకేష్ మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా ఏపీలో క్రీడల అభివృద్ధికి ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ తగిన సహకారం అందించే విధంగా చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఇండియన్ క్రికెటర్లతో లోకేష్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. మొన్ననే సీఎం చంద్రబాబు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కలిసిన సచిన్ టెండూల్కర్ తో ముచ్చటించారు. చాలాసేపు ఉల్లాసంగా గడిపారు. ఏపీలో క్రికెట్ అభివృద్ధికి సచిన్ సలహాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఏపీకి ఒక బ్రాండ్ ఇమేజ్ రావాలి అంటే అంతర్జాతీయ స్థాయి క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలన్నది ఆయన ప్రణాళిక. అందులో భాగంగానే క్రికెట్ ను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. స్వతహాగా క్రికెట్ అంటే ఇష్టపడే లోకేష్.. ఏపీని క్రికెట్ రంగంలో అగ్రగామిగా నిలపాలని భావిస్తున్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version