Vasireddy Padma : వాసిరెడ్డి పద్మ.. ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా వినిపిస్తున్న పేరు ఇది. తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు ఆమె. జనసేనలో చేరుతారని ప్రచారం సాగుతోంది. అయితే ఆమె ఏ పార్టీలో ఉన్నా..చేరినా, చేరకపోయినా చేతినిండా పుష్కలంగా పని దొరకడం ఖాయం. ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వాసిరెడ్డి పద్మ. అప్పట్లో ప్రజారాజ్యం విధానాలు నచ్చి ఆ పార్టీలో చేరారు. సిద్ధాంతపరంగా మాట్లాడతారని ఆమెపైమంచి అభిప్రాయం ఉంది. వ్యక్తిగత కామెంట్లకు దూరంగా ఉంటారు. అందుకే అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు వాసిరెడ్డి పద్మ. 2009 ఎన్నికల్లో పిఆర్పి ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి. అప్పటివరకు అదే పార్టీలో కొనసాగారు పద్మ. కానీ జగన్ వైసీపీని ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు. ఆ పార్టీలో సైతం అధికార ప్రతినిధిగా మారారు.2019 ఎన్నికల్లో వైసిపి విజయం సాధించటంతో వాసిరెడ్డి పద్మకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఏకంగా క్యాబినెట్ హోదా తో సమానమైన మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవిని సొంతం చేసుకున్నారు ఆమె. అయితే చట్టసభల్లో అడుగు పెట్టాలన్నది ఆమె ధ్యేయం. అందుకే ఆమె ఎన్నికల్లో అసెంబ్లీ సీటును ఆశించారు. కానీ జగన్ అవకాశం ఇవ్వలేదు. ఎన్నికల తర్వాత పార్టీ ఇన్చార్జిగా తనను కాదని వేరే నేతను నియమించారు. దీంతో వైసీపీలో ఉంటేతనకు భవిష్యత్తు ఉండదని ఒక నిర్ధారణకు వచ్చారు. అందుకే ఆ పార్టీని వీడారు. జనసేనలో చేరతారని ప్రచారం సాగుతోంది.
* మంచి వాగ్దాటి కలిగిన నేత
అయితే వాసిరెడ్డి పద్మ రాజకీయాల్లో ఉండాలే కానీ ఆమె.. క్రియాశీలకంగా ఉండేందుకు అవసరమైన వనరులను సంపాదించుకున్నారు. సుదీర్ఘకాలం రాజకీయ పార్టీలకు అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. మౌత్ పీస్ గా మారారు. తప్పకుండా ఆమెను మీడియా ఛానల్లు కచ్చితంగా వినియోగించుకుంటాయి. వైసీపీకి రాజీనామా చేశారు కాబట్టి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఆమెను కచ్చితంగా వినియోగించుకుంటుంది. ప్రతి అంశంపై ఆమెకు అవగాహన ఉంది. ఆపై వైసీపీ రాజకీయాలను దగ్గర నుంచి చూశారు. అందుకే ఆమె సేవలను టిడిపి అనుకూల మీడియా వినియోగించుకుంటుందని.. తద్వారా ఆమెకు రాజకీయ అవకాశాలు కలిసి వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది.
* రఘురామకృష్ణం రాజు అసంతృప్తి వాయిస్
2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు రఘురామకృష్ణం రాజు. నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి గెలిచారు. గెలిచిన కొన్ని నెలలకే పార్టీ అధినాయకత్వాన్ని విభేదించారు. అయితే సామాజిక అంశాలపై అవగాహన ఉండడంతో టిడిపి అనుకూల మీడియాకు ఆయన వనరుగా మారిపోయారు. నాలుగేళ్లపాటు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వేదికగా ఆయన తన గళం విప్పారు. ఇప్పుడు వాసిరెడ్డి పద్మ కూడా అదే మాదిరిగా వ్యవహరించనున్నారు. కచ్చితంగా ఆమె మీడియా ఛానల్లో విశ్లేషకురాలు అవుతారని.. ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఆమె హైలెట్ అవుతారని ప్రచారం సాగుతోంది. అయితే వైసీపీకి రాజీనామా చేయడంతో ఆయన సేవలను టిడిపి అనుకూల మీడియా వినియోగించుకోనుందని ప్రచారం సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.