Lakshmi: తిరుపతి జనసేన పార్టీ(Janasena Party) ఇంచార్జ్ కిరణ్ రాయల్(Kiran Royal) పేరు గత వారం రోజులుగా సోషల్ మీడియా లో మారుమోగిపోతున్న సంగతి మనమంతా చూస్తూనే ఉన్నాము. లక్ష్మి(lakshmi) అనే మహిళ కిరణ్ రాయల్ తనకు కోటి రూపాయలకు పైగా మోసం చేసాడని, తమ కుటుంబం పై రౌడీయిజం చేస్తున్నాడని, ఇలా పలు రకాల ఆరోపణలు చేస్తూ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని వేడుకున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రెస్ క్లబ్ నుండి బయటకు రాగానే రాజస్థాన్ పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీంతో కిరణ్ రాయల్ మీడియా ముందుకొచ్చి ఆమె పెద్ద కిలాడీ అని, ఎంతోమందిని ఆమె ఆన్లైన్ ద్వారా మోసం చేసిందని, పోలీసులు ఆమె కోసం గాలిస్తున్న సమయంలో ప్రెస్ మీట్ పెట్టడం వాళ్లకు ఈమె ఆచూకీ తెలిసి అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్పుకొచ్చాడు.
అయితే నేడు లక్ష్మి కి జైపూర్ సీజేఎం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చెక్ బౌన్స్ కేసు లో అరెస్ట్ అయ్యినందున ఆమెకు అక్కడి కోర్టు రెండు సార్లు 50 వేల పూచికత్తు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. లక్ష్మి బెయిల్ మీద విడుదల అవ్వడం కిరణ్ రాయల్ కి పెద్ద షాక్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రేపటి నుండి ఆమె మీడియా ముందుకొచ్చి కిరణ్ రాయల్ బాగోతాలను మరికొన్ని బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క కిరణ్ రాయల్ ని జనసేన పార్టీ నిజానిజాలు తేలేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం పార్టీ ఒక ప్రత్యేక కమిటీ ని కూడా ఏర్పాటు చేసింది. కిరణ్ రాయల్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు ఎంతో విధేయుడు. 2009 వ సంవత్సరం నుండి ఆయన రాజకీయ ప్రయాణం వీళ్ళిద్దరితోనే కొనసాగిస్తూ వచ్చాడు.
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా పరాజయం పాలైనప్పటికీ కిరణ్ రాయల్ పార్టీ ని వీడలేదు. ఆ పార్టీ తరుపున ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అత్యంత యాక్టీవ్ గా ఉండే లీడర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆయనపై అనేక అభియోగాలు ఉన్నాయి. తిరుపతిలో ఈయన రౌడీయిజం గురించి తెలిసే పవన్ కళ్యాణ్ ఇన్నేళ్ల నుండి పార్టీ లో ఉన్నా 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని టాక్. అరణి శ్రీనివాసులు కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం పై మొదట్లో నిరసన తెలిపిన కిరణ్ రాయల్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడడంతో ప్రచారం లో పాల్గొన్నాడు. ఇప్పుడు ఆయనపై ఇన్ని అభియోగాలు వచ్చాయి, ఇక పార్టీ లో ఆయనకీ తిరిగి ఛాన్స్ రావడం అనేది ప్రస్తుతానికి అసాధ్యమే. తానూ క్లీన్ వైట్ పేపర్ అని నిరూపితం అయ్యాకనే తిరిగి పార్టీ లోకి రావాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.