Kurnool Bus Incident: ఆంధ్రప్రదేశ్ లో శుక్రవారం వేకువజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం 19 మందిని పొట్టన పెట్టుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సు రోడ్డు నిద్రిస్తున్న 19 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ విషాద ఘటన అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రమాదంలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. బస్సు మంటల్లో ఒక్క తల్లి చూపిన నిస్వార్థ త్యాగం.. అగ్నికి ఆవహమైన క్షణాల్లో కూడా ఆమె మొదటి ఆలోచన తన కూతురు ప్రాణం కాపాడే ప్రయత్నం.. అందరిని కదిలిస్తుంది. బస్సులో మంటలు ఎగిసిపడుతున్నప్పుడు బయటకు రావడానికి ఒక్క క్షణం ఉన్నా, ఆమె గుండెల్లోంచి బిడ్డను వదిలిపెట్టలేదు. తానేమైపోయిన తన బిడ్డకు ఏమీ కాకూడదనే ఆ ఆప్యాయ ఆలింగనం ఇద్దరినీ కాలిపోయేలా చేసింది.
చివరి క్షణంలో మాతృ స్పర్శ
ప్రమాదం జరిగిన తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వైద్యులు ఫోరెన్సిక్ ని పనులు కాలిపోయిన మృతదేహాలను వెలికి తీశారు. బొగ్గుల మారిన శరీరాలను పరిశీలించిన రక్షణ సిబ్బందికి ఒక దృశ్యం కళ్ళు చెమరిచేలా చేసింది. అది తల్లి శరీరం నల్లగా కాలిపోయినా, బిడ్డను గట్టిగా హత్తుకున్న స్థితిలోనే ఉంది. అది మరణ దృశ్యం కాదు, అది మాతృక అనురాగం. బిడ్డపై మమకారం. జీవితాన్ని విడిచి పెట్టినా, తన బిడ్డను విడిచి పెట్టకపోయిన తల్లి రూపం, ప్రేమకు ఉన్న పరిమితులను నిర్వీర్యం చేసింది.
బిడ్డకు రక్షణ కవచంగా మారిన శరీరం ..
తల్లి గుండె వద్ద ఉన్న బిడ్డ మృతదేహం బాగా కాలిపోయింది. ఇది ఆమె శరీరం మంటల నుంచి ఒక గోడలా నిలిచిందని సూచిస్తుంది. నిప్పు కప్పేసినా, ఆమె చేతులు చివరి వరకూ ఆ బిడ్డను కాపాడే కవచంలా పనిచేశాయి. ఆ క్షణం ఒక తల్లి ప్రేమ ఎంత శక్తివంతమో మరోసారి గుర్తు చేసింది.
బాధను మించిన బలం
ప్రతి విపత్తు కొన్ని బాధలను మిగులుస్తుంది, కానీ కొన్ని సంఘటనలు బాధకన్నా విలువైన స్ఫూర్తిని నింపుతాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన అనూష ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.. ప్రాణాన్ని కోల్పోయినా మాతృత్వం పట్ల సత్యాన్ని తిరిగి రాయగలిగింది. “తల్లి ప్రేమకు మంటలు కూడా హద్దు కాలేవు” అని ఆమె నిరూపించింది.
మానవ సంబంధాల్లో తల్లి హృదయపు నిబద్ధతకు అనూష చూపిన ఆ త్యాగం నిదర్శనం. అగ్నిలో శరీరం బూడిద అయినా, ప్రేమ మాత్రం శాశ్వతంగా ఉండగలదనే నిదర్శనం అనూష చూపింది. తన బిడ్డ కోసం అంతిమ క్షణం వరకూ పోరాడిన ఆమె మరువలేని మాతృక. మంటల్లో కరిగిపోయింది ఆమె శరీరం కాదు, ప్రేమకు కొత్త రూపం ఇచ్చిన కరుణామయి.