Kommineni tears debate video: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు( Kommineni Srinivasa Rao) జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కొమ్మినేని అరెస్టు అయ్యారు. నిన్ననే జైలు నుంచి విడుదలైన ఆయన విధులకు హాజరయ్యారు. సాక్షి మీడియాలో డిబేట్ నిర్వహించారు. ఈ క్రమంలో తనకు ఇటీవల ఎదురైన పరిణామాలను గుర్తు చేసుకుని బాధపడ్డారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురయ్యారు. ఒకానొక దశలో కన్నీటి పర్యంతం అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ పార్టీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. కొమ్మినేని శ్రీనివాసరావు ప్రతి కన్నీటి బొట్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాయి.
కన్నీళ్ళు పెట్టుకున్న KSR గారు
ప్రతి కన్నీటి బొట్టుకు సమాధానం చెప్తాం pic.twitter.com/217pb9nI0r
— (@2029YSJ) June 18, 2025
అమరావతి మహిళలపై కామెంట్స్
కొద్దిరోజుల కిందట సాక్షి మీడియాలో( Sakshi media) ఓ డిబేట్ జరిగింది. అమరావతి ప్రాంతంలో ఆ తరహా మహిళలు ఉన్నారంటూ జర్నలిస్ట్ కృష్ణంరాజు సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆ కార్యక్రమం నిర్వాహకుడిగా, యాంకర్ గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు దానిని సమర్థించేలా మాట్లాడారు. ఈ క్రమంలో రాజధాని ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. మహిళా రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి హైదరాబాదులో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును ముందుగా అరెస్టు చేశారు. అటు తర్వాత ఆ వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు సైతం అరెస్టయ్యారు.
Also Read: Jagan Palnadu Updates: జగన్ ఒంటరిగా రావాల్సిందే.. పోలీసుల హుకూం.. పల్నాడులో ఉద్రిక్తత
సుప్రీం కోర్టులో బెయిల్
అయితే కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆయనకు కోర్టు బెయిల్ ఇవ్వలేదు. అయితే ఆయన హైకోర్టును ఆశ్రయించకుండా.. నేరుగా సుప్రీంకోర్టు( Supreme Court) తలుపు తట్టారు. కేసు విచారించిన అత్యున్నత న్యాయస్థానం… కొన్ని రకాల వ్యాఖ్యలు చేస్తూ.. కింది కోర్టు షరతులకు లోబడి బెయిల్ ఇచ్చింది కొమ్మినేని కి. ఈ తరుణంలో ఆయన తిరిగి తన జర్నలిస్టు విధిని ప్రారంభించారు. ఈరోజు డిబేట్ నిర్వహించారు. ఈ క్రమంలో తనకు 70 ఏళ్ల వయసు అని.. 50 సంవత్సరాల జర్నలిస్ట్ కెరీర్లో ఇంతటి పరిస్థితి ఎప్పుడు ఎదుర్కోలేదని.. ఎవ్వర్నీ పల్లెత్తు మాట అనలేదని.. రాజకీయ ప్రత్యర్థులకు సైతం గౌరవించాలని సూచించే వాడినని.. అటువంటి తన విషయంలో జరిగిన పరిస్థితులను తలచుకొని ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యారు. ప్రస్తుతం కొమ్మినేని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నాయి.