Rythu Bharosa : ఏపీలో కూటమి ప్రభుత్వం( Alliance government) దూకుడు మీద ఉంది. కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ భేటీ అవుతుండడంతో మరిన్ని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 19న దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులతో పాటుగా సంక్షేమ పథకాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. సచివాలయాల క్రమబద్దీకరణ, రైతు భరోసా అమలు, అన్న క్యాంటీన్లు, కల్లుగీత కార్మికులకు మద్యం దుకాణాలపై నిర్ణయం తీసుకోనున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై సైతం చర్చించే అవకాశం ఉంది. ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రివర్గ భేటీ చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది.
* చర్చించే అంశాలు ఇవే
ప్రధానంగా మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలను చర్చించే అవకాశం ఉంది. భూ కేటాయింపులకు ఆమోదముద్ర వేయనుంది క్యాబినెట్. సచివాలయాల క్రమబద్ధీకరణ పై ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జనాభా ప్రాతిపదికన సచివాలయాల కొనసాగింపు, సిబ్బంది సర్దుబాటు పైన నివేదిక ఆధారంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో 1.27 లక్షల మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వాలంటీర్ల అంశంపై సైతం తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సచివాలయాల అంశం చర్చకు వచ్చే సమయంలో కచ్చితంగా వలంటీర్ల విషయంలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
* ఆ పథకాల విషయంలో ఫుల్ క్లారిటీ
సంక్షేమ పథకాల అమలు విషయంలో సైతం మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ నిధుల విడుదల విషయంలో స్పష్టతనిచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తాం.. రైతుల ఖాతాల్లో నిధులు ఎప్పుడు జమ చేస్తాం అన్న విషయంలో స్పష్టత ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. పట్టణాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పల్లెలకు వాటిని విస్తరిస్తామని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ నిర్ణయానికి నేటి క్యాబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేయనున్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పై కూడా స్పష్టత వచ్చే పరిస్థితి ఉంది.
* రాజకీయ అంశాలపై
మంత్రివర్గ సమావేశంలో రాజకీయ పరిస్థితులు సైతం చర్చకు వచ్చే పరిస్థితి ఉంది. ప్రధానంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మంత్రివర్గ సహచరులకు సీఎం చంద్రబాబు వివరించే ప్రయత్నం చేయనున్నారు. మరోవైపు తన దావోస్ పర్యటనకు సంబంధించి లక్ష్యాలను సైతం వివరించనున్నారు చంద్రబాబు. మంత్రుల పనితీరుకు సంబంధించి కీలక విషయాలను బయట పెట్టనున్నారు. రాజకీయ అంశాలకు సంబంధించి సహచర మంత్రుల అభిప్రాయాలను తీసుకొనున్నారు