KCR Lokesh controversy : తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి. అయితే తెలంగాణలో జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్( Congress) అధికారంలో ఉంది. ఏపీలో మాత్రం జాతీయ పార్టీల జాడలేదు. ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ వర్సెస్ టిడిపి అన్నట్టు పరిస్థితి ఉంటుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మిత్రులు ఉన్నారు. శత్రువులు ఉన్నారు. శత్రువుకు ప్రత్యర్థి మిత్రుడుగా పరిగణిస్తారు తెలుగు రాష్ట్రాల్లో. చంద్రబాబు వ్యతిరేకి కెసిఆర్. అందుకే చంద్రబాబుకు ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డితో కేసిఆర్ కు స్నేహం. అయితే గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల పాలకులుగా ఉన్న కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ప్రతిపక్షంలోకి వెళ్లిపోయారు. వారిద్దరి ఉమ్మడి శత్రువు చంద్రబాబు ఏపీలో అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో సైతం చంద్రబాబు ఒకప్పటి సహచరుడు, శ్రేయోభిలాషి గా భావించే రేవంత్ సీఎం అయ్యారు. అయితే రాజకీయంగా విభేదించుకోవచ్చు కానీ.. తమ మధ్య వ్యక్తిగత సంబంధాలు ఉంటాయని నేతలు చెబుతుంటారు. అయితే రాజకీయంగా విభేదించుకునేవారు.. వ్యక్తిగతంగా మాట్లాడేందుకు ఇష్టపడరని కూడా తాజాగా తేలిపోయింది.
* మాగంటి గోపీనాథ్ మృతి..
నిన్ననే గుండెపోటుతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్( maganti Gopinath ) మృతి చెందారు. ఆయన తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే అనూహ్య పరిస్థితుల్లో ఆయన అప్పట్లో టిఆర్ఎస్ లో చేరారు. టిడిపి నాయకత్వంతో ఎంతో నమ్మకంగా ఉండే ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ వెంట నడవాల్సి వచ్చింది. అయినా సరే కెసిఆర్ కు నమ్మదగిన మిత్రుడిగా మారారు. 2018, 2023 ఎన్నికల్లో సైతం బిఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గోపీనాథ్ నిన్ననే కన్నుమూశారు. దీంతో టిఆర్ఎస్ శ్రేణులతో పాటు టిడిపి శ్రేణుల్లో కూడా సంతాపాలు వ్యక్తమయ్యాయి.
Also Read : ‘మహానాడు’ లో నారా లోకేష్ నోట.. అల్లు అర్జున్ మాట..దద్దరిల్లిపోయిన సభ!
* పక్కపక్కనే కూర్చున్నా..
తనకు ఎంతగానో నమ్మకస్తుడైన నేత కావడంతో కెసిఆర్( KCR) కూడా స్వయంగా హాజరై నివాళులు అర్పించారు. అదే సమయంలో ఏపీ మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి వచ్చారు. కెసిఆర్ పక్కనే కూర్చున్నారు లోకేష్. వారి వెనుక నిల్చుని కనిపించారు కేటీఆర్. దాదాపు పావుగంట సేపు అక్కడే ఉన్నా వారి మధ్య మాటా మంతీ లేదు. దీంతో అక్కడ ఉద్విగ్న భరి త వాతావరణం సాగింది. అయితే అది విషాద ఘటన కావడంతో ఎవరికివారుగా మౌనం దాల్చారు. కానీ దీనిపైనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. వారి మధ్య మాటలు లేనంత గ్యాప్ ఉందని ప్రచారం చేస్తున్నారు. అయితే బయటకు వచ్చిన తర్వాత కెసిఆర్ తో పాటు కేటీఆర్ తో లోకేష్ సంభాషించారని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. కానీ ప్రచారం మాత్రం వేరే లెవెల్ లో ఉంది.
మాగంటి గోపీనాథ్ కు నారా లోకేష్ గారు నివాళి..
బ్రాహ్మణితో కలిసి మాగంటి నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించిన లోకేష్
మాగంటి కుటుంబ సభ్యులను ఓదార్చిన లోకేష్ #Hyderabad pic.twitter.com/prPLW7XkMD
— (@Trends4TDP) June 8, 2025