Kapus Vote : ఏపీలో కులాల కుమ్ములాటలు, కుంపట్లు ఎక్కువే. ఆ మాటకు వస్తే అన్ని రాష్ట్రాల్లో ఈ జాడ్యం ఉంది. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి అధికం. సామాజిక ఉద్యమాలు కూడా ఎక్కువే. అయితే ఇవి రాజకీయం ముసుగులో జరుగుతున్నాయి అన్న అపవాదును మూటగట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కాపు కులం ఇలానే సమిధగా మారిపోయింది. ఏపీ జనాభాలో అధిక నిష్ఫత్తి ఉండి అటు ఆర్థిక రిజర్వేషన్ ఫలాలు దక్కడం లేదు. రాజకీయ ఆకాంక్ష తీరడం లేదు. ఈ క్రమంలో కాపులపై జరిగే క్రీనీడ అంతా ఇంతా కాదు. దీంతో ఎన్నికలు వస్తున్నాయి.. పోతున్నాయి. ఏదో ఒక పార్టీకి కాపులు మద్దతు పలుకుతున్నారు. కానీ కాపుల ఆకాంక్షను మాత్రం ఎవరూ తీర్చలేకపోతున్నారు.
ఈ సారి కాపులు ఎవరికి మద్దతుపలుకుతారు? అంటే మాత్రం ఠక్కున చెప్పే సమాధానం జనసేన అనే. దశాబ్దాలుగా కాపుల్లో బలమైన ఆకాంక్ష ఉన్నా బయట పెట్టే చాన్స్ రాలేదు. ఈసారి మాత్రం కాపులు బాహటంగానే చెబుతున్నారు. పవన్ కు మద్దతు తెలుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ను సీఎం స్థానంలో కూర్చోబెట్టాలని చూస్తున్నారు. కానీ ఇక్కడే పవన్ ఒక తప్పటడుగు వేశారు. నిజాయితీతోనే చెప్పేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని తేల్చేశారు. దీంతో కసితో ఉన్న కాపుల్లో కాస్తా నైరాశ్యం అలుముకుంది. పవన్ ప్రకటనలతో కాపు సామాజికవర్గం కొంచెం నిరాశలోకి వెళ్లిపోయారు.
ఒకటి మాత్రం నిజం. ప్రతిఎన్నికల్లోనూ కాపులే డిసైడింగ్ ఫ్యాక్టర్. వారు ఎటువైపు మొగ్గుచూపితే వారే పవర్ లోకి రాగలుగుతున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత బీసీలు ఆకర్షితులయ్యారు. కానీ ఎస్సీ, ఎస్టీలు మాత్రం చెక్కుచెదరలేదు. వారు కాంగ్రెస్ పార్టీతోనే తమ అనుబంధాన్ని కొనసాగించారు. కాపులు మాత్రం ప్రతిఎన్నికకు నిర్ణయం మార్చుకుంటూ వస్తున్నారు. బహుశా కాంగ్రెస్ పార్టీకి ఇదొక కంటగింపుగా మారింది. అందుకే వంగవీటి మోహన్ రంగా హత్యను నీరుగార్చింది. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత చిరంజీవిని సీఎం చేసే చాన్స్ వచ్చినా ఆ పనిచేయలేదు.
గత ఎన్నికల్లో పవన్ ఒంటరి పోరాటం చేసినా కాపులు మద్దతు తెలపలేదు. 2014 ఎన్నికల్లో పవన్ టీడీపీ, బీజేపీలకు మద్దతు తెలపడంతో రెండు పార్టీలు అధికారంలోకి రాగలిగాయి. ఆ ప్రభుత్వాలు ఏర్పాటుచేశాయి. కానీ వారి వైఫల్యాలు పవన్ కు శాపంగా మారాయి.టీడీపీ, జనసేన ఒక్కటేనని జనాలను నమ్మించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. అటు టీడీపీ ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్ ఉద్యమంపై ఉక్కుపాదంతో కాపులు చంద్రబాబుకు దూరమయ్యారు. పవన్ కు కాకుండా జగన్ కు దగ్గరయ్యారు. కానీ టీడీపీ ప్రభుత్వం కంటే జగన్ హయాంలో దారుణంగా వంచించబడ్డారు. అందుకే గత తప్పిదాలను గుర్తుచేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కు ఏకపక్షంగా మద్దతు తెలపాలని డిసైడయ్యారు. ఇప్పటివరకూ కింగ్ మేకర్లమని.. ఇక నుంచి కింగ్ లు మారుతామనరి గంటాపధంగా చెబుతున్నారు.
Recommended Video: