Kadapa: ఏపీలో వజ్రాలు.. ఎగబడుతున్న ఆ జిల్లాల ప్రజలు

కడప జిల్లాలో జోరుగా వజ్రాల వేట సాగుతోంది. వల్లూరు మండలంలో ఈ క్షేత్రం ఉంది. దీనిని దక్షిణ కాశీగా కూడా చెబుతారు. కడప నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండకు ఉదయాన్నే వందలాదిమంది భక్తులు చేరుకుంటారు.

Written By: Dharma, Updated On : October 17, 2023 3:55 pm

Kadapa

Follow us on

Kadapa: ఆ కొండపై వజ్రాలు దొరుకుతున్నాయి అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంకేముంది ప్రజలు ఎగబడుతున్నారు. వజ్రాల కోసం జోరుగా అన్వేషిస్తున్నారు. కడపలోని పుష్పగిరి క్షేత్రంలో జరుగుతోంది ఈ వజ్రాల వేట. ఒక వజ్రం దొరికితే తమ బతుకు మారిపోతుందన్న ఆశతో సామాన్య ప్రజలు కొండను జల్లెడ పడుతున్నారు. ఉదయం నుంచి ఇసుక వేస్తే రాలనంత జనం వస్తుండడం విశేషం. దీంతో పుష్పగిరి క్షేత్రం జనసంద్రంగా మారిపోతోంది.

కడప జిల్లాలో జోరుగా వజ్రాల వేట సాగుతోంది. వల్లూరు మండలంలో ఈ క్షేత్రం ఉంది. దీనిని దక్షిణ కాశీగా కూడా చెబుతారు. కడప నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండకు ఉదయాన్నే వందలాదిమంది భక్తులు చేరుకుంటారు. వజ్రాల కోసం అన్వేషణ ప్రారంభిస్తారు. ఈ కొండపై వజ్రాలు దొరికాయి అన్న ప్రచారం జరగడమే ఇందుకు కారణం. కొండ కింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తోంది. నది ఇక్కడ పాము ఆకారంలో ఉండడం విశేషం. అలాగే పుష్పగిరికి సమీపంలో పాపాగ్ని, కుమ్ముద్వతి, వల్కల, మాండవి నదులు కలుస్తున్నాయి. అందుకే దీనిని పంచ నది క్షేత్రం అంటారు. చంతనే చెన్నకేశవ ఆలయం, సంతాన మల్లేశ్వర ఆలయాలు ఉన్నాయి.

ఈ క్షేత్రానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ క్షేత్రంలో పెద్ద ఎత్తున వజ్రాలు దొరుకుతున్నాయన్న టాక్ కడప జిల్లాతో పాటు కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లోపెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.దీంతో ఆ మూడు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున కొండ వద్దకు తరలివస్తున్నారు.వజ్రాల వేట సాగిస్తున్నారు. కొత్తగా ఏదైనా రాయి కనిపిస్తే చాలు వాటిని తమ సంచుల్లో నింపేస్తున్నారు. అయితే వజ్రాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం విశేషం.