KA Paul: తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్( KA Pal ) తీరు వేరు. సమకాలిన అంశాలపై ఆయన చాలా యాక్టివ్ గా స్పందిస్తారు. చాలా యాక్టివ్ గా మాట్లాడతారు. తాజాగా సింహాచలం ఘటనపై స్పందించారు కే ఏ పాల్. గోడ కూలిపోయి ఎనిమిది మంది మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో తిరుపతిలో అలా జరిగిందని.. ఇప్పుడు సింహాచలంలో ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. ఇంత జరుగుతుంటే సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని నిలదీశారు. తిరుమల ఘటన నేపథ్యంలోనే తాను సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు కేఏ పాల్. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: మోహన్ బాబుకు వెంటాడుతున్న ఎన్నికల కేసు!
* ప్రత్యేక వీడియో విడుదల.. సింహాచలంలో( Simhachalam) గోడ కూలి ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. సింహాచలం చరిత్రలోనే ఇది పెను విషాదం. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సైతం బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ప్రశ్నించారు. తాజాగా ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ప్రజల ప్రాణాలు పోతున్నా కూటమి సర్కార్ పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. కోట్లాది కోట్లు టికెట్ల రూపంలో వసూలు చేస్తున్నారని.. మరి ఆలయాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించరా అంటూ ప్రశ్నించారు.
* ఆలయాలకు స్వయం ప్రతిపత్తి..
ఆలయాలకు( Hindu temples ) స్వయం ప్రతిపత్తి కల్పించాలని కేఏ పాల్ డిమాండ్ చేయడం విశేషం. ఇప్పటికే చర్చిలకు కమిటీలు ఉన్న సంగతి తెలిసిందే. అదే కమిటీలను ఆలయాలకు వేసి.. సక్రమంగా నిర్వహించాలని కేఏ పాల్ సూచించారు. తిరుపతిలో తొక్కిసలాట, లడ్డూ వివాదం నేపథ్యంలో తను కోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు కేఏ పాల్. క్రిస్టియన్ చర్చిల మాదిరిగా.. హిందూ దేవాలయాలకు సైతం కమిటీలు వేసి.. రాజకీయాలకు దూరంగా ఉంచాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. మరోసారి ఆలయాల్లో ఇటువంటి ఘటనలు జరగకుండా పట్టిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు కేఏ పాల్. అయితే కూటమి ప్రభుత్వానికి గట్టిగానే హెచ్చరిస్తూనే.. విలువైన సలహా ఇచ్చారు. ప్రస్తుతం పాల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Dr K A Paul about Visakhapatnam Simhachalam temple deaths blasting A. P. C . M & DY . C. M. Must share pic.twitter.com/nApxe90fBn
— Dr KA Paul (@KAPaulOfficial) April 30, 2025