Junior NTR (1)
Junior NTR: మరోసారి కూటమి( Alliance government ) ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా కూటమి పార్టీల మధ్య అగాధం ప్రారంభం అయింది. కొద్దిరోజుల కిందట పిఠాపురంలో జనసేన ప్లీనరీ జరిగింది. ఆ ప్లీనరీ వేదికగా జనసేన ఎమ్మెల్సీగా ఎన్నికైన మెగా బ్రదర్ నాగబాబు ప్రసంగం వివాదంగా మారింది. పిఠాపురంలో పవన్ గెలుపుకు రెండే కారణాలని.. ఒకటి పవన్, రెండోది పిఠాపురం ప్రజలని.. కానీ పవన్ గెలుపు తమ కృషి ఉందని ఎవరనుకుంటే అది పొరపాటేనని.. అది వారి కర్మ అని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు నాగబాబు. దీనిపై టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ కామెంట్స్ టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ ఉద్దేశించినవని ఎక్కువ మంది అనుమానిస్తున్నారు. నాగబాబు తీరుపై మండిపడుతున్నారు.
Also Read: ఔరంగజేబు సమాధిపై వివాదం… వీలునామాలో ఏముంది?
* పవన్ పై తగ్గుతున్న గౌరవం
ఇంకోవైపు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan)సైతం చేసిన వ్యాఖ్యలపై టిడిపి శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. అరాచక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించామని.. తాము నిలబడుతూనే.. 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టామని పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సెగలు పుట్టిస్తున్నాయి. టిడిపి శ్రేణుల్లో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఇప్పటివరకు పవన్ విషయంలో టిడిపి శ్రేణులు గౌరవభావంతో మెలిగాయి. కానీ పవన్ కళ్యాణ్ టిడిపిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ తర్వాత పార్టీ శ్రేణుల అభిప్రాయం మారుతోంది.
నువ్వొస్తే పొత్తులకి పోయి కుక్కలతో మాటలు పడకుండా పార్టీ గౌరవంని కాపాడుకోవచ్చు @tarak9999
better late than never.
— appie (@fizz_nandamuri) March 14, 2025
* టిడిపి శ్రేణుల మండిపాటు
ఈ ఎన్నికల్లో టిడిపి కూటమి ( TDP Alliance ) గెలవడానికి చంద్రబాబు, లోకేష్ పాదయాత్ర, టిడిపి శ్రేణుల పోరాటం, జగన్మోహన్ రెడ్డి అరాచక వాదం కారణాలుగా చెప్పి ఓ టిడిపి అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 2004, 2009లో వరుసగా రెండుసార్లు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని.. కానీ చంద్రబాబు కృషితో మరోసారి అధికారంలోకి వచ్చిందని మరో అభిమాని గుర్తు చేస్తూ పోస్ట్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్ అవసరం లేదని.. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఈ పొత్తులు కూడా అవసరం లేదని మరో అభిమాని వ్యాఖ్యానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. రాజకీయంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి తప్ప.. ఇలా స్వార్థం గా మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ కు ఇబ్బందులు తప్పవని మరో అభిమాని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అయితే అదే సమయంలో చంద్రబాబుతో పాటు పవన్ సఖ్యతగా ఉన్నారని.. కింద ఈ చిల్లర నాయకులే ఇటువంటి కామెంట్స్ చేస్తారని మరికొందరు అభిప్రాయం పడుతున్నారు. మొత్తానికైతే జనసేన పై టిడిపి శ్రేణులు చాలా ఆగ్రహంగా ఉండడం విశేషం.