https://oktelugu.com/

Jr NTR Fan : నిన్న అల్లు అర్జున్.. నేడు జూనియర్ ఎన్టీఆర్.. అభిమానులు జస్ట్ ప్రీమియర్ షోలకు టికెట్లు కొనే వెర్రిబాగులోళ్ళు.. సినీ హీరోలకు వాళ్లు చచ్చినా పట్టరు..

ఆ బాలుడి పేరు కౌశిక్.. జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని.. పాపం చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడ్డాడు. అతడిని దక్కించుకోవడానికి కుటుంబ సభ్యులు చెన్నై అపోలోలో చేర్పించారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 23, 2024 / 06:57 PM IST

    Jr NTR Fan Kaushik

    Follow us on

    Jr NTR Fan :  కౌశిక్ ఎక్కువ కాలం బతకడని డాక్టర్లు తేల్చి చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కావడంతో.. దేవర సినిమా చూసి చనిపోవాలని కౌశిక్ తన చివరి కోరికగా చెప్పాడు. ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్ దాకా చేరింది. దీంతో అతడు కౌశిక్ కుటుంబ సభ్యులతో వీడియో కాల్ లో మాట్లాడారు. కౌశిక్ చికిత్సకు అవసరమైన ఖర్చు మొత్తం భరిస్తానంటూ మాట ఇచ్చారు. కానీ ఆ మాటను నిలుపుకోవడంలో జూనియర్ ఎన్టీఆర్ విఫలమయ్యారట. కౌశిక్ కు చికిత్స అందించినందుకు అపోలో హాస్పిటల్ కు భారీగానే ఫీజు చెల్లించారు. ఇంకా 20 లక్షల దాకా చెల్లించాల్సి ఉందట. దానిని చెల్లించలేక కౌశిక్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారట.. ఇది సోషల్ మీడియాలో కనిపించిన వార్త… తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా వెలుగొందేవాళ్లు బటి చెప్పే మాటలు వేరే విధంగా ఉంటాయి. లోపల వాళ్ల గుణాలు వేరే విధంగా ఉంటాయి. అంతిమంగా స్టార్ హీరోలకు డబ్బు కావాలి. ఆ డబ్బు ద్వారా వచ్చే విలాసాలు కావాలి. ఆడంబరాలు, ఆస్తులు సంపాదించుకోవాలి. సాధన సంపత్తిని పెంపొందించుకోవాలి.. ఇవన్నీ సమకూరుతున్న సమయంలో అభిమానులు చచ్చినా స్టార్ హీరోలు పట్టించుకోరు.. ఇటీవల అల్లు అర్జున్ ఎలా వ్యవహరించాడో చూసాం కదా.. ఇలాంటి పరిణామాలు ఎదురైనప్పటికీ సో కాల్డ్ అభిమానులు మారడం లేదు. ఇక్కడ బన్నీ విషయం కాదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కాదు.. హీరో ఎవరైనా సరే.. అభిమానులను పట్టించుకోరు. ఆ మాటకొస్తే ఫ్యాన్స్ చుట్టాలు కాదు. దోస్తులు అంతకన్నా కాదు. వాడెవడో చెప్పినట్టు.. పెంట మీద పురుగులు.. చచ్చినా పర్వాలేదు. సర్వనాశనమైనా ఇబ్బంది లేదు. ఎంతసేపటికి స్టారాధిస్టారులకు జిందాబాద్ లు కొట్టారా లేదా. అయిన వాళ్లను పట్టించుకోకపోయినప్పటికీ.. తల్లిదండ్రుల సేవలో తరించకపోయినప్పటికీ.. ఈ మూర్ఖపు స్టార్ దేవుళ్ల సేవలో బతికి చస్తే చాలు.. స్టార్ దేవుళ్లది ఇక్కడ తప్పులేదు.. వాళ్లే కాదు ఎవడైనా సరే పూజలు చేస్తుంటే.. నిలువెత్తు కటౌట్లు ఏర్పాటు చేసి పూలదండలు వేస్తుంటే ఎందుకు వద్దంటారు.. పైగా ఆ బలుపును, ఆ వాపును ఎందుకు దూరం చేసుకుంటారు. అ అసలు ఈ సోయి అభిమానులకు ఉండాలి. వాళ్లను గుడ్డిగా ఆరాధిస్తున్నందుకు సిగ్గుపడాలి..

    యువత దే తప్పు

    ఈ సో కాల్డ్ స్టార్ ల పై విపరీతమైన అభిమానం పెంచుకొని.. కెరియర్లను మొత్తం సంక నాకించుకొని.. ఎటు కాకుండా యువత భ్రష్టు పట్టిపోతున్నదనేది నిష్ఠుర సత్యం. ఫేక్ బాబాల గురించి మనం ఏదో ఒక సందర్భంలో చదువుతూనే ఉంటాం. స్టార్ హీరోలు కూడా వాళ్ళ బాపతే. సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ లో శ్రీ తేజ్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అతడికి మేమున్నామని ఓ రేంజ్ లో కబుర్లు చెప్పిన సోకాల్డ్ అల్లు అర్జున్, అతడి తండ్రి అల్లు అరవింద్.. ఇంతవరకు వీసమెత్తు సహాయం ఏమైనా చేశారా? ఈ కథనం రాసే సమయానికి.. మీడియా, సోషల్ మీడియా నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షల సహాయాన్ని ప్రకటించింది. ఒకవేళ ఈ స్థాయిలో గనుక ఒత్తిడి రాకుండా ఉండి ఉంటే జస్ట్ సైలెంట్ గా ఉండిపోయేది. ఎవడికో పుట్టిన బిడ్డ చచ్చిపోయాడని లైట్ తీసుకునేది. ఇవాల్టికి శ్రీ తేజ్ కు కాస్త కూస్తో అండగా ఉన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే. తన కొడుకు పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా 25 లక్షల చెక్కును శ్రీ తేజ్ తండ్రికి అందించాడు. ఉదయం లేస్తే అభిమానులు మా గుండె చప్పుడు.. అభిమానులు మాకు దేవుళ్ళు అని డొల్ల కబుర్లు చెప్పే ఒక్క స్టార్ యాక్టర్ శ్రీ తేజ్ కుటుంబం దగ్గరికి వెళ్ళలేకపోయాడు. అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలై వస్తే బారులు తీరిన నటుల్లో ఒక్కడు కూడా అటువైపు చూడలేదు.. చూసే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ గుణమే అటువంటిది కాబట్టి.. ఇప్పటికైనా ఆ సోకాల్డ్ నటుల కోసం యువత ఒళ్ళు చించుకోపోవడం.. ప్రీమియర్ షోలకు వేలకు వేలు తగలేసుకోకపోవడం మంచిది!