Jogi Ramesh: జోగి రమేష్( Jogi Ramesh ) అరెస్టు ఖాయమా? ఆయనపై పోలీసులకు పూర్తి ఆధారాలు దొరికాయా? కోర్టుకు అన్ని వివరాలను సమర్పించారా? ఇక జోగి రమేష్ తప్పించుకునే అవకాశమే లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో జోగి రమేష్ అరెస్టు ఖాయమని ప్రచారం నడుస్తోంది. ఆయన హడావిడి చూస్తుంటే కూడా అదే నిజమని తెలుస్తోంది. ప్రతిరోజు ప్రమాణాలు, సవాళ్లు అంటూ ఆయన హంగామా చేసేసరికి.. ఎందుకో భయపడుతున్నారని.. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అర్థమవుతోంది. ఆయన అరెస్టుకు తెరవెనుక మొత్తం ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది.
Also Read: ప్రభాస్ రెమ్యూనరేషన్ లో సగం ఆ అకౌంట్ కి వెళ్ళిపోతోందా..? కారణం ఏంటంటే..?
* ప్రమాణం అంటూ హడావిడి..
మొన్న ఆ మధ్యన విజయవాడ( Vijayawada ) దుర్గమ్మ సన్నిధిలో కుటుంబమంతా కలిసి ప్రమాణానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిణామంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సైతం చర్చ సాగుతోంది. జోగి రమేష్ అతి చేస్తున్నారని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. అనవసరంగా పార్టీని కల్తీ మద్యం కేసులో ఇరికించారని జగన్మోహన్ రెడ్డి సైతం అసహనంతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. వాస్తవానికి జోగి రమేష్ మంత్రిగా ఉండేటప్పుడు కల్తీ మద్యం తయారు చేయించారన్న ఆరోపణలు ఇప్పుడు బలపడుతున్నాయి. అప్పట్లో ఏ మనుషులు చేత ఆ పని చేయించారో.. ఇప్పుడు అదే పని వారితో చేయించి ప్రభుత్వంపై మరకలు అంటించాలని చూశారు. దీనిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ కుటుంబం ఇన్వాల్వ్ అయింది. కుమారుడితో పాటు కుటుంబ సభ్యులు కూడా అరెస్టయ్యారు. అయితే ఇప్పుడు కుటుంబంతో కలిసి ప్రమాణానికి సిద్ధపడటం మాత్రం సాహసమే. తప్పు చేయనప్పుడు ఆ ప్రమాణాలు ఎందుకన్నది ఇప్పుడు ప్రశ్న.
* కోర్టుకు పూర్తి వివరాలు..
తమకు ఇస్తామన్న నగదు ఇవ్వకపోవడం.. కేసుల్లో ఇరికించడం.. తాము ఎవరిమో తెలియదని బుకాయించడం వంటి వాటితో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడు జగన్మోహన్రావు పూర్తి వివరాలు పోలీసులకు అందించారు. అప్పట్లో జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలో ఎలా ప్రోత్సహించారు.. నకిలీ మద్యం ఎలా తయారు చేసింది.. వంటి సమగ్ర వివరాలను అందించారు. అదే వివరాలతో నివేదికను పోలీసులు కోర్టుకు అందించారు. కోర్టు ఆదేశాలతోనే జోగి రమేష్ అరెస్ట్ జరగనుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది రాజకీయ అరెస్టు అని భావించడానికి వీలు లేకుండా.. ఒక పద్ధతి ప్రకారం దర్యాప్తు జరిపి జోగి రమేష్ ను అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే అరెస్ట్ అయితే జోగి రమేష్ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదని సమాచారం. అందుకే జోగి రమేష్ ఈ హడావిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.