https://oktelugu.com/

Ambati Rambabu Vs Janasena: అంబటి రాంబాబును తగులుకున్న జనసేన

Ambati Rambabu: సమయం ఏదైనా.. సందర్భం ఏదైనా వైసీపీలో కొందరు కీలక నాయకులు, మంత్రులు జనసేన అధినేత పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. అందులో ముందు వరుసలో మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. పవన్ అంటేనే ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అసలు జనసేన ఒక పార్టీయేనన్న రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. జనసేన రాజకీయ వ్యూహాలు, పొత్తులపై పదేపదే ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు జన సైనికులు కౌంటర్లు ఇస్తున్నా అంబటి వెనక్కి తగ్గడం లేదు. జనసేన శ్రేణుల సహనాన్ని పరీక్షించేలా లేనిపోని […]

Written By:
  • Dharma
  • , Updated On : August 17, 2022 / 11:13 AM IST
    Follow us on

    Ambati Rambabu: సమయం ఏదైనా.. సందర్భం ఏదైనా వైసీపీలో కొందరు కీలక నాయకులు, మంత్రులు జనసేన అధినేత పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. అందులో ముందు వరుసలో మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. పవన్ అంటేనే ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అసలు జనసేన ఒక పార్టీయేనన్న రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. జనసేన రాజకీయ వ్యూహాలు, పొత్తులపై పదేపదే ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు జన సైనికులు కౌంటర్లు ఇస్తున్నా అంబటి వెనక్కి తగ్గడం లేదు. జనసేన శ్రేణుల సహనాన్ని పరీక్షించేలా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. దీంతో జనసైనికులు స్పీడ్ పెంచారు. సోషల్ మీడియాలో అంబటిని టార్గెట్ చేస్తూ తెగ కామెంట్లు చేస్తున్నారు. వాటిని ట్రోల్ చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సమయం, సందర్భం లేకుండా అంబటి చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు. ఇప్పుడుది రాజకీయంగా చర్చనీయాంశమైంది. అంబటి తాను చేపడుతున్న శాఖను వదిలి అదే పనిగా పవన్ పై వ్యక్తిగత కామెంట్లు చేస్తుండడాన్ని జనసైనికులు సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అంబటి పై పోస్టులతో నిండిపోతోంది. అనవసరంగా జనసేనతో పెట్టుకున్నానన్న రేంజ్ లో అయితే ఆయనపై జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు విరుచుకుపడుతున్నారు.

    Ambati Rambabu:

    Also Read: Munugode Bypoll TRS- BJP: మునుగోడులో టీఆర్ఎస్ కు షాక్.. బీజేపీ దూకుడు

    ఆ కామెంట్స్ తో..
    మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మంగళవారం స్వాతంత్ర దినోతవ్స వేడుకల్లో పవన్ ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలవనివ్వమని చెప్పారు. ఓట్లు చీల్చబోనివ్వమని స్పష్టం చేశారు. దీనిపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ట్విట్టర్ లో పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాటన్ దుస్తులు చాలెంజ్ ఆపి.. అసలు 175 నియోజకవర్గాల్లో పోటీచేస్తారా? లేదా? అన్నది స్వాతంత్ర దినోత్సవం నాడైనా ప్రకటించండి అంటూ సవాల్ చేశారు. అయితే జనసేన, పవన్ పై ఎవరైనా కామెంట్ చేస్తే తిప్పికొట్టడంలో మెగా బ్రదర్ నాగబాబు ముందుంటారు. అంబటి కామెంట్స్ పై నాగబాబు కూడా అదే రేంజ్ లో ప్రతిస్పందించారు. బాబూ ఓ రాంబాబు.. అడిగిన ప్రశ్న ఎన్నిసార్లు అడుతావయ్యా..జంబో సర్కస్ లో బఫూన్లు అడిగే ప్రశ్నలకు.. వైసీపీ సర్కస్ లో నీలాంటి బఫూన్ లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే తీరిక మా జనసైనికులకు లేదని.. మా అధినేత పవన్ కు అంతకంటే లేదని వ్యాంగ్యోక్తులు సంధించారు. అంతటితో ఆగకుండా ఆయన ఫొటో మార్ఫింగ్ చేస్తూ మరీ ట్విట్ చేశారు. దీంతో జన సైనికులు రెచ్చిపోయారు. తీవ్ర అసహనం, ఆగ్రహంతో సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టడం మొదలు పెట్టారు.

    Pawan Kalyan:

    Also Read: Rajendra Prasad- Senior NTR: సీనియర్ ఎన్టీఆర్ కు రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పిన సినిమా ఏదో తెలుసా?

    తెరపైకి బండ్ల గణేష్..
    పవన్ వీరాభిమాని, నిర్మాత బండ్ల గణేష్ సైతం లైన్ లోకి వచ్చారు. వస్తూ వస్తూనే మంత్రి అంబటి రాంబాబుపై ఓ లెవల్లో విరుచుకుపడ్డారు. రంభల రాంబాబు మా సారు నీకు త్వరలో సమాధానం చెబుతారు అంటూ ట్విట్ చేశారు. అంతటితో విమర్శలు ఆపినా.. మంత్రి అంబటి తిరిగి వ్యాఖ్యలు చేస్తే మాత్రం బండ్ల గణేష్ మరింత రెచ్చిపోయే అవకాశముంది. గతంలో వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఈ విధంగానే వ్యాఖ్యానించగా.. బండ్ల గణేష్ స్పందించారు. విజయసాయిరెడ్డికి ధీటుగా హాట్ హాట్ కామెంట్లు చేశారు. చివరికి విజయసాయిరెడ్డి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ చాన్స్ మంత్రి అంబటి రాంబాబుకు వచ్చింది. ఈ విషయంలో కానీ మరోసారి మంత్రి అంబటి రాంబాబు పవన్ పై వ్యాఖ్యానిస్తే మాత్రం బండ్ల గణేష్ నుంచి అదే స్థాయిలో కామెంట్లు వచ్చే అవకాశముంది.

    Bandla Ganesh:

    Also Read: Bilkis Bano Gang Rape Case : బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులకు స్వీట్లు, సన్మానాలు.. పెనుదుమారం

    ఇకపై కౌంటర్ ఎటాక్..
    జనసేనాని పవన్ తన రాజకీయ విధానాన్ని స్పష్టంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వమని మాత్రమే స్పష్టం చేశారు. కానీ అయిన దానికి..కానిదానికి వైసీపీ నేతలు పవన్ ను టార్గెట్ చేయడాన్ని జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటి నుంచి వైసీపీ నేతల కామెంట్స్ కు ధీటుగా కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇది తెలియని మంత్రి అంబటి మాత్రం పవన్ పై కామెంట్స్ చేసి జనసైనికులకు అడ్డంగా బుక్కయ్యారు.