Nagababu: పవన్ పెళ్లిళ్లపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తనకు నాలుగు పెళ్లిళ్లు అంటూ జగన్ తరచూ కామెంట్స్ చేస్తుండడంపై పవన్ ఓ రేంజ్ లో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. నాకు మూడు పెళ్లిళ్లు అయ్యాయని.. నాలుగో పెళ్ళాం జగనే అయి ఉంటారని పవన్ పంచ్ వేశారు. నీకు నేనే మొగుడు అన్నట్టు సంకేతాలు ఇచ్చారు. అయితే ఈ కామెంట్ ఆ సభ తోనే ఆగలేదు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. వదిన అంటూ సంభోధాలు.. నీకు మొగుడు అంటూ వ్యాఖ్యానాలతో జనసైనికులు రెచ్చిపోతున్నారు. వైసిపి శ్రేణులు రియాక్ట్ అవుతుండడంతో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇప్పట్లో ఈ రచ్చ ఆగేలా కనిపించడం లేదు.
ఇటువంటి పరిస్థితుల్లో మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. ఉన్నట్టుండి వదిన అన్న ఒక పాత సినిమా పోస్టర్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అప్పట్లో బాగా నచ్చిన సినిమా ఇది అని క్యాప్షన్ పెట్టారు. సరిగ్గా వదిన, మొగుడు అన్న చర్చ నడుస్తుండగానే.. నాగబాబు ఈ పోస్ట్ పెట్టడం విశేషం. తరచూ జగన్ తన వైవాహిక జీవితం గురించి మాట్లాడడాన్ని పవన్ తట్టుకోలేకపోయారు. అందుకే తాడేపల్లిగూడెం సభలో నాకు లేని నాలుగో పెళ్లి పెళ్ళాం గురించి జగన్ అబద్దాలు చెబుతున్నారు అంటూ ఆవేశంతో ఊగిపోయారు. ఆ నాలుగో పెళ్ళం నువ్వే నా జగన్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అక్కడ నుంచి వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టు సోషల్ మీడియాలో అతి పెద్ద యుద్ధమే సాగుతోంది. సరైన రీతిగా స్పందించారంటూ పవన్ కు జనసైనికులు అండగా నిలుస్తున్నారు. మీమ్స్ కూడా ఒక రేంజ్ లో పేలుతున్నాయి.
సాధారణంగా జనసైనికులు పవన్ కళ్యాణ్ ను అన్నా అని సంభోదిస్తుంటారు. ఇప్పుడు జగన్ తన పెళ్ళంగా పవన్ చెప్పడంతో వారంతా వదిన అంటూ జగన్ ను ర్యాగింగ్ చేస్తున్నారు. గత మూడు రోజులుగా వదిన అన్నమాట సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లో నాగబాబు మరింత ఆజ్యం పోశారు. గతంలో కూడా నాగబాబు ఇటువంటి వివాదాస్పద పోస్టులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ మీద విమర్శలు చేసినప్పుడు పాతకాలం హాస్యనటుడు బాలకృష్ణ తనకు తెలుసు అంటూ పంచులు వేసి నందమూరి ఫ్యాన్స్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు వైసిపి శ్రేణులకు మైండ్ బ్లాక్ అయ్యేలా వదిన అంటూ పోస్ట్ పెట్టి రచ్చకు కారణం అవుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.