Andhra Pradesh : ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి ఏడాది సమీపిస్తోంది. అయినా సరే కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదు. ఇప్పటికీ చాలా కార్యాలయాల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉండడంతో ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఆరాధన భావంతో కొలుస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఫోటోలను అట్టే ఉంచారు. ముఖ్యంగా జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జడ్పీ అధ్యక్షులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావడంతోనే ఈ ఫోటోలకు కొనసాగింపు జరుగుతోంది. అనంతపురం జిల్లాలో ఈ పరిస్థితిని చూసిన టిడిపి ఎమ్మెల్యేలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే జగన్ ఫోటోలను తొలగించి సీఎం చంద్రబాబు ఫోటోలను ఏర్పాటు చేయించారు.
* స్టోర్ రూమ్ పక్కన చంద్రబాబు ఫోటో..
నిన్ననే అనంతపురం( Ananthapuram ) జిల్లా పరిషత్ సమావేశం జరిగింది. టిడిపి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఫోటోను స్టోర్ పక్కన ఉండడాన్ని గుర్తించారు. అయితే చైర్పర్సన్ గిరిజమ్మ ఛాంబర్ లో మాత్రం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో అందంగా అలంకరించారు. సీఎం చంద్రబాబు ఫోటోలు మాత్రం స్టోర్ రూమ్ వద్ద పెట్టారు. దీనిని గమనించిన టిడిపి ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, అల్మినేని సురేంద్రబాబు, ఎమ్మెస్ రాజు జిల్లా పరిషత్ సీఈఓ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ దిబ్బరమైన ప్రకారం జగన్ ఫోటో పెట్టారని ప్రశ్నించారు. మాజీ సీఎం చిత్రపటాన్ని ఎలా ఉంచుతారని జడ్పీ సీఈఓ పై మండిపడ్డారు. వెంటనే జగన్ మోహన్ రెడ్డి ఫోటో తీయించి.. మహాత్మా గాంధీతో పాటు సీఎం చంద్రబాబు ఫోటోలను అక్కడ పెట్టించారు.
Also Read : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ.. కూటమి సర్కార్ సంచలన నిర్ణయం!
* కర్నూలు జిల్లాలో సైతం..
కొన్ని నెలల కిందట కర్నూలు జిల్లాలో( Kurnool district) కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అక్కడ విజయ డెయిరీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే అఖిలప్రియ సందర్శించారు. చైర్మన్ చాంబర్లో మాజీ సీఎం జగన్తో పాటు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలు ఉండడాన్ని గుర్తించారు. అక్కడ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా ప్రోటోకాల్ పాటించకపోవడం పై మండిపడ్డారు. ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లా పరిషత్ కార్యాలయాల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటోలను అలానే ఉంచారు. అయితే ఇప్పుడిప్పుడే టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురంలో ఒక్కసారిగా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు.