CM Jagan: రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఒకప్పుడు నాయకులు విధానాలపై విమర్శలు చేసుకునేవారు. వ్యక్తిగతంగా మాత్రం సఖ్యత గానే ఉండేవారు. కుటుంబాల మధ్య స్నేహాన్ని ఎప్పుడు కూడా వదులుకోలేదు. పైగా అధికారంలోకి వచ్చేందుకు రకరకాల దండోపాయలను ప్రయోగించలేదు. కేవలం ప్రజల్లో మాత్రమే ఉండేవారు. ప్రజల సమస్యలపై పోరాడేవారు. అది అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా.. కేవలం విధానపరంగా విమర్శలు చేసుకునేవారు. వ్యక్తిగత విషయాల జోలికి ఎప్పుడూ వెళ్లేవారు కాదు. నాడు రాజకీయాలలో ఇలాంటి విలువలు పాదుకొల్పారు కాబట్టే.. ఆ నాయకులు అంటే నేటికీ ప్రజలు ఇష్టపడుతున్నారు. కానీ ఇప్పటి రాజకీయాల్లో అలాంటి పరిస్థితి లేదు. వ్యక్తిగత విమర్శలు తీవ్రమైపోయాయి. సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ విమర్శల స్థాయి కూడా దాటిపోయింది.
ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది.. అధికార వైసిపి గతంలో మాదిరిగానే ఒంటరిగానే పోటీ చేస్తోంది. అక్కడి ప్రతిపక్ష పార్టీలైన జనసేన, టిడిపి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి.. ఇప్పటికే కొన్ని సీట్లకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించాయి. ఇక మిగతా కాంగ్రెస్, బిజెపి ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ షర్మిల జగన్ మీద విమర్శల దాడి పెంచారు. ఇక బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి కూడా ఇదే స్థాయిలో జగన్ మీద విమర్శలు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా జగన్ ప్రభుత్వ పనితీరును తప్పుపడుతున్నారు. మీడియా పరంగా చూసుకుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అవి పచ్చ డప్పు కొడుతూనే ఉన్నాయి. జగన్ మీద రోజూ విమర్శలు చేస్తూనే ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు వాళ్లకు కూడా అధికార పక్షం నుంచి గట్టి కౌంటర్ కావాలి కదా.. అలాంటి కౌంటర్ జగన్ ఇచ్చేశారు.
ఎన్నికలకు సిద్ధం అనే నినాదంతో ఇటీవల జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. పలు ప్రాంతాలలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు చేస్తున్నారు. ఆంధ్ర ప్రాంతంలో రాజకీయాలు చేసే నాయకులకు తెలంగాణ ప్రాంతంతో ఏం పని అని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రాలో రాజకీయాలు చేసేవాళ్లంతా ఆంధ్ర ప్రాంతంలో ఉండక.. తెలంగాణలో ఎందుకు ఉంటున్నారని అడుగుతున్నారు.. ఈ ప్రశ్నతో చంద్రబాబు నాయుడు నుంచి మొదలుపెడితే ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ వరకు అందరికీ ఒకేసారి జగన్ ఇచ్చి పడేశారు.. అంటే జగన్ కు హైదరాబాదులో ఇళ్ళు లేవా? అంటే ఉన్నాయి. కానీ ఆయన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర లోనే ఉంటున్నారు. గత ఎన్నికలకు ముందే తాడేపల్లిలో భవనం నిర్మించుకున్నారు. ఇక మిగతా నాయకులకు ఎవరికీ సొంత ఇళ్ళు ఆంధ్ర ప్రాంతంలో లేవని జగన్ విమర్శిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతంలో ఇళ్ళు లేని వాళ్లు ఇక్కడ రాజకీయాలు ఎలా చేస్తారంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రశ్నించిన ఈ వీడియోను వైసీపీ సోషల్ మీడియా విభాగం తెగ సర్కులేట్ చేస్తోంది. ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జగన్ ప్రశ్నించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
పచ్చ బ్యాచ్ మొత్తానికి ఒకేసారి ఇచ్చి పడేసిన జగనన్న #Siddham pic.twitter.com/CSPXl3XhH7
— Inturi Ravi Kiran (@InturiKiran7) February 3, 2024