Homeఆంధ్రప్రదేశ్‌Jagan Meets Steel Plant Victims Families: విశాఖకు జగన్.. జరిగేది అదే కదా?!

Jagan Meets Steel Plant Victims Families: విశాఖకు జగన్.. జరిగేది అదే కదా?!

Jagan Meets Steel Plant Victims Families: విశాఖ స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబాలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు . ఈపాటికే దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో వెళ్తుందనేది చెప్పనవసరం లేదు. ఒకవైపు సీఎం సీఎం అనే నినాదాలు. మరోవైపు షక్కటి చిరునవ్వుతో జగన్మోహన్ రెడ్డి చిద్విలాసాలు ఎన్నో కనిపిస్తాయి. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయన పరామర్శల శైలి వేరుగా ఉంటుంది. సెంటిమెంట్ పాలిటిక్స్ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు విశాఖ వెళ్తారు. బాధితులకు పరామర్శిస్తారు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతారు. ఎక్స్ గ్రేషియా ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఇదంతా ఒక స్క్రిప్ట్ ప్రకారం జరిగిపోతుంది. కార్మిక సంఘాల నేతలు, వామపక్షాల ప్రతినిధులు సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ వీరిని ఉక్కుపాదంతో అణిచివేశారు. ఇప్పుడు ప్రతిపక్షం కాబట్టి వీరి ప్రశ్నించేందుకు ఏమీ ఉండదు.

* ఇచ్చేందుకు ఇష్టపడరు..
జగన్మోహన్ రెడ్డికి ఒక అలవాటు ఉంది. ఎంతవరకు తన ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తాను అంటారే తప్ప.. పార్టీ ఫండ్ నుంచి కానీ.. తన సొంత జేబులో నుంచి కానీ ఒక్క పైసా కూడా ఇచ్చేందుకు ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా పార్టీలో బడా నేత సాయం చేస్తే తన చేతుల మీదుగా అందించి ఆ క్రెడిట్ కొట్టేస్తారు. సొంత సొమ్ము అంటే ఆయనకు అంతలా ఇష్టం. ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇచ్చేందుకు ఇష్టపడరు. అంతులేని సంపద ఆయన వద్ద ఉందన్నది బహిరంగ రహస్యం. కానీ అందులో ఒక్క రూపాయి కూడా ఎప్పుడు ఎవరికీ ఇచ్చిన దాఖలాలు లేవు. చివరకు విపత్తుల సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధికి అందించే నగదును కూడా తాను సొంతంగా అందిస్తానని చెప్పిన మహామేధావి నేత జగన్. ఇప్పుడు సాయం చేస్తారు అనుకుంటే మనం పొరపడినట్టే.

* అధికారంలోకి వస్తే..
ఎక్కడకు వెళ్ళు.. ఏ బాధితులను పరామర్శించు.. జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చే ఒకే ఒక్క మాట. ఇప్పుడు మన దగ్గర అధికారం లేదు. కళ్ళు మూసుకుని తెరిస్తే మరో మూడు సంవత్సరాలు ఇట్టే వచ్చేస్తాయి. మన ప్రభుత్వం వచ్చాక బోలెడంత ఇస్తాం. కొండలను పిండి చేసి మీ చేతుల్లో పెడతాం అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెబుతుంటారు.. పదేపదే అబద్ధాలు చెబితే అవి విమర్శలుగా మారుతాయి. కానీ వాటిని వినిపించుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి లేరు. శవ రాజకీయాలు చేయడం.. ప్రభుత్వంపై బురద జల్లడం.. సాక్షి మీడియాతో ఫేక్ డ్రామాలు ఆడించినట్టుగా.. సీఎం సీఎం అని నినాదాలు చేయించడం అనేది వారికి అలవాటైన విద్య.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version