Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan: నిన్నటి వరకు '11'.. ఇకనుంచి మూడు.. జగన్ పై సెటైర్

YS Jagan: నిన్నటి వరకు ’11’.. ఇకనుంచి మూడు.. జగన్ పై సెటైర్

YS Jagan: జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ముచ్చటను ఆయనే ముగించేశారు. అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. చట్టపరంగా దానికి అడ్డంకులు ఏర్పడడంతో ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అయితే మూడు రాజధానులు అయితే ముగించారు కానీ ఇప్పుడు కొత్తగా మూడు నగరాలను కలుపుతూ మావిగన్ ఏర్పాటు చేయాలని సెలవు ఇచ్చారు. అయితే ఆయనకు మూడు అనే పదం చాలా నచ్చినట్టు ఉంది. మొదట మూడు రాజధానులు అన్నారు. ఇప్పుడు మావిగన్ తో మూడు నగరాలను కలపాలని అంటున్నారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు ప్యాలస్ లను అనుసంధానం చేస్తున్నారు. మొన్నటి వరకు తాడేపల్లి ప్యాలెస్ లో ఉండేవారు. ఎన్నికల్లో ఓటమితో బెంగళూరు యెలహంక ప్యాలెస్ కు వెళ్తున్నారు. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ లోని లోటస్ ఫండ్ ప్యాలెస్ కు వెళ్లాలని భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే మొన్నటి వరకు 11 సంఖ్య చుట్టూ సెటైర్లు నడిచాయి కానీ.. ఇప్పుడు మూడు చుట్టూ నడుస్తున్నాయి.

* మూడు రాష్ట్రాల్లో ప్యాలెస్ లు
జగన్మోహన్ రెడ్డి పై ఒక విమర్శ ఉంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణ ఆయనపై ఎక్కువగా ఉంది. అందుకు తగ్గట్టుగానే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడకు వెళ్లిన ఆయనకు ప్యాలెస్లు ఉన్నాయి. హైదరాబాద్ వెళ్తే లోటస్ ఫండ్ ఉంది. బెంగళూరు వెళితే ఎలాహంక ప్యాలెస్ ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ముచ్చటగా తాడేపల్లిలో మరో ప్యాలెస్ కట్టుకున్నారు. అయితే ఇప్పుడు రెండు ప్యాలెస్ ల చుట్టూ షటిల్ సర్వీసులు చేస్తున్నారని.. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ ప్యాలెస్ వైపు అడుగులు వేస్తుండడంతో.. ఇకనుంచి మూడు ప్యాలెస్ ల మధ్య షటిల్ సర్వీసులు నడుస్తాయని సెటైర్లు పడే అవకాశం ఉంది.

* హైదరాబాద్ కు షిఫ్ట్..
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే హైదరాబాద్ లోటస్ ఫండ్ ప్యాలెస్ ను ముచ్చట పడి కట్టుకున్నారు. అయితే అందులో రెండు విభాగాలు ఉన్నాయి. ఒకదాంట్లో షర్మిల నివాసం ఉంటున్నారు. మరో ఒక్కటి ఖాళీగా ఉంది. అయితే తనతో విభేదిస్తున్న షర్మిల ఉండడంతో జగన్మోహన్ రెడ్డి అటువైపు వెళ్ళలేదని తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ అడుగు దాటి వెళ్లేవారు కాదు. అధికారంలో తర్వాత బెంగళూరు ప్యాలెస్ గుర్తుకు వచ్చింది. అయితే రాజకీయంగా సెంటిమెంట్ అంతగా కలిసి రావడం లేదు. అందుకే సెంటిమెంట్ కలిసి వచ్చిన లోటస్ ఫండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గుర్తుకు వచ్చింది. అయితే ఇప్పుడు జగన్ హైదరాబాద్ లోటస్ ఫండ్ కు చేరితే మాత్రం.. ముచ్చటగా మూడు మార్చినట్టు అవుతుంది. ఇప్పటికే 11 సంఖ్య చుట్టూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై సెటైర్లు పడుతున్నాయి. ఇప్పుడు మూడు చుట్టూ కూడా అటువంటివి తప్పదు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular