https://oktelugu.com/

India Alliance: ఇండియా కూటమి వైపు ఆ జగన్, నవీన్.. ఆప్షన్ లేదుగా! బీజేపీతో ఫైట్ నే

గతం మాదిరిగా ప్రాంతీయ పార్టీలు తటస్థంగా ఉంటామంటే కుదిరే పని కాదు. జాతీయస్థాయిలో ఏదో ఒక కూటమిలో చేరాల్సిందే. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది ఏపీ మాజీ సీఎం జగన్, ఒడిస్సా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ లకు..

Written By:
  • Dharma
  • , Updated On : November 7, 2024 / 12:32 PM IST

    India Alliance

    Follow us on

    India Alliance: దేశంలో జమిలీ ఎన్నికల సందడి ప్రారంభం అయ్యింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగాలన్నది ఈ ఎన్నికల లక్ష్యం.దీనిని ఎలాగైనా జరిపించాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో అత్యున్నత కమిటీ ఏర్పాటు చేసింది మోడీ సర్కార్. జమిలీ ఎన్నికలకు అనుకూలంగా నివేదిక ఇచ్చింది ఈ కమిటీ. ఈ పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ఉభయ సభలకు రానుంది. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందుతే.. సార్వత్రిక ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాలకు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి రోడ్ మ్యాప్ కూడా సిద్ధం కానుంది. ఒక అంచనా ప్రకారం 2027 ద్వితీయార్థంలో జమిలీ ఎన్నికలు వస్తాయన్నది ప్రచారంగా ఉంది. అయితే గతం మాదిరిగా కాకుండా అసెంబ్లీలతో పాటు ఎంపీ స్థానాలకు పోటీ ఒకేసారి జరగనుండడంతో.. జాతీయస్థాయిలో కూటమిలో ప్రధాన పాత్ర పోషించునున్నాయి. ప్రస్తుతం దేశంలో రెండు కూటములు కొనసాగుతున్నాయి. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈసారి తలపడనున్నాయి. అయితే ఎన్డీఏలో బిజెపి, టిడిపివంటివి బలమైన పార్టీలుగా ఉన్నాయి. ఇండియా కూటమిలో మాత్రం కాంగ్రెస్ తో పాటు బలమైన ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నాయి. ఒకవేళ జమిలి వస్తే మాత్రం రెండు కూటమిల మధ్య హోరాహోరీ ఫైట్ తప్పేలా లేదు.

    * ఎన్డీఏలో చాన్స్ లేదు
    ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన బలమైన మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు కలిసి ఏపీలో ఘనవిజయం సాధించాయి. దాదాపు అన్ని సీట్లను స్వీప్ చేశాయి. వచ్చే ఎన్నికల నాటికి ఆ మూడు పార్టీలు కలిసే వెళ్లాలని భావిస్తున్నాయి. దీంతో జగన్ నేతృత్వంలోని వైసీపీకి ఇండియా కూటమి ఆప్షన్ గా కనిపిస్తోంది.తప్పకుండా ఆ కూటమిలో చేరి పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జగన్ ప్రభంజనం సృష్టించారు.2024 ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఉంటుందని ఒంటరిగా బరిలో దిగారు.దారుణ పరాజయం మూటగట్టుకున్నారు.2029లో కానీ.. అంతకంటే ముందే వచ్చే జమిలీ కానీ.. జగన్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిందే. అది కూడా ఇండియా కూటమిలోని కాంగ్రెస్తో పాటు వామపక్షాలతో. అంతకంటే జగన్ కు ఆప్షన్ లేదు.

    * మోసం చేసిన బిజెపి
    మరోవైపు ఇండియా కూటమిలోకి ఒడిస్సా లోని బీజేడీ చేరనుంది. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఆ పార్టీ ఒడిస్సాను ఏకపక్షంగా ఏలింది. బిజెడి కిబిజెపి బలమైన ప్రతిపక్షంగా ఉండేది. కానీ ఈసారి బిజెపితో తెగతెంపులు చేసుకొని సొంతంగా పోటీ చేసింది. మూల్యం చెల్లించుకొంది. అయితే జాతీయస్థాయిలో బిజెపికి మద్దతు తెలిపి చాలా తప్పు చేశానని నవీన్ భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఒడిస్సాలో బిజెపి గెలుపు వెనక ఈవీఎంలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. తన రాజ్యసభ సభ్యులను సైతం బిజెపి వైపు వెళ్లకుండా కట్టడి చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా కూటమిలో చేరితేనే బిజెపికి దెబ్బ తీయగలమనినవీన్ పట్నాయక్ భావిస్తున్నారు.మొత్తానికైతే జగన్ తో పాటు నవీన్ పట్నాయక్ ఇండియా కూటమి వైపు అడుగులు వేయడం ఖాయం.