Homeఆంధ్రప్రదేశ్‌Jagan: జగన్ సినిమా చూపిస్తారా.. చూస్తున్నారా

Jagan: జగన్ సినిమా చూపిస్తారా.. చూస్తున్నారా

Jagan: జనంలోకి వస్తా.. చంద్రబాబుకు సినిమా చూపిస్తా.. అధికారంలోకి వస్తా.. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు తిప్పిన స్టేషన్ తిప్పకుండా చేస్తా.. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మాటలే చెబుతున్నారు. అయితే ఆయన భయం పెట్టాలని.. ఆందోళనకు గురి చేయాలని ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. ఇలాంటివి చేసిన తరువాతనే ప్రజలు ఆయనకు అధికారం నుంచి దూరం చేశారు. ఈ విషయాన్ని ఆయన గ్రహించలేకపోతున్నారు. పదే పదే అవే హెచ్చరికలు చేస్తున్నారు. ఏవేవో మాటలు చెబుతున్నారు. ఆయన ప్రజల్లోకి వచ్చింది లేదు. ప్రజల సమస్యలతో మాట్లాడుతుంది లేదు. ఎంతవరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాలు, కేసులను ఎదుర్కోవడానికి సమయం పడుతుంది. ప్రజా సమస్యలపై స్పందించిన దాఖలాలు లేవు. అమరావతి పై కుట్రలు చేసేందుకు, రాజధానులను మార్చేందుకు దృష్టి పెడుతున్నారే తప్ప.. ప్రజల మధ్యకు వచ్చి పోరాటం చేయాలన్న ధ్యాస మరిచిపోతున్నారు. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు కూడా..

Also Read: డేవిడ్ మిల్లర్.. అప్పుడు.. ఇప్పుడు.. నష్ట జాతకుడు

* అన్ని రకాల అవకాశాలు..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) పాదయాత్ర కొత్త కాదు. ఆయన పాలనా కొత్త కాదు. బలమైన ప్రతిపక్షనేతగా అవకాశం ఇచ్చింది ప్రజలే. బలమైన మెజారిటీ ఇచ్చి ముఖ్యమంత్రిని చేసింది ప్రజలే. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా 11 స్థానాలను కట్టబెట్టింది ప్రజలే. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తానంటే చూసేందుకు ఎవరూ రెడీగా లేరు. ఎందుకంటే 2017 లోనే ఆయన పాదయాత్ర చేసి సినిమా చూపించారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సినిమాను సూపర్ హిట్ చేయలేకపోయారు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి అదే సినిమా పూర్తిగా డిజాస్టర్ అయింది. కానీ ఇప్పుడు పదే పదే సినిమా చూపిస్తాను. అంటూ చంద్రబాబును హెచ్చరిస్తున్నారు. 2029 లో ఆయన అధికారంలోకి రావాలి. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. కేవలం ఆయన రెండేళ్ల పాలన మాత్రమే పూర్తి చేశారు. ఇంకా మూడేళ్ల వ్యవధి ఉంది. చంద్రబాబు సినిమా చూపించాలంటే ఇప్పుడు చూపించగలరు. మరో మూడేళ్ల తర్వాత జగన్ సినిమా చూపిస్తానంటున్నారు. కానీ ఇప్పుడే చంద్రబాబు చూపించగలరు అన్న విషయాన్ని మరిచిపోతున్నారు.

* ప్రజల్లోకి వచ్చేది ఎప్పుడు..
ఒక మాటను పదేపదే చెప్పడం ద్వారా చులకన కావడమే తప్పించి దాని ద్వారా ఒరిగే ప్రయోజనం ఉండదు. అప్పుడెప్పుడో ఓడిపోయిన కొత్తలో ప్రజల్లోకి వస్తాను కాచుకోండి అంటూ సవాల్ చేశారు జగన్. రెండు సంక్రాంతులు దాటి వెళ్లిపోయాయి కానీ.. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చింది లేదు. పోరాడింది లేదు. ఇప్పుడు ప్రజా సమస్యల కంటే తన పార్టీ సమస్యలే ఆయనకు అధికం. వాటిని చక్కదిద్దుకోకుండా అందరికీ సినిమా చూపిస్తానని చెబుతున్నారు. అప్పుడే రెండున్నర ఏళ్లు గడిచిపోయాయి. కళ్ళు మూసుకుంటే మరో రెండున్నర ఏళ్ళు గడిచి పోతాయి అని కలలు కంటున్నారు. కానీ ప్రజల మధ్యకు వెళితే కదా.. ప్రజల్లోకి వచ్చి వారి సమస్యలను తెలుసుకుంటే కదా వారు నమ్మేది. అది మరిచిపోయి తన గెలుపు సునాయాసం అని తెగ మాటలు చెప్పేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.

* అన్ని రకాల సినిమా కనిపిస్తోంది..
మావిగన్ అని రెండో ఆప్షన్ గా చెబుతున్నారు జగన్. పాలనా వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి మూడు రాజధానులు అన్నారు. ఒకవైపు ఏమో రాజధానుల స్టాండ్స్ మారుస్తున్నారు. ఇంకోవైపు ఏమో సినిమా చూపిస్తాను అంటున్నారు. ప్రస్తుతం సినిమా చూస్తోంది ఆయనే. సొంత పార్టీ శ్రేణులు కేసుల్లో చిక్కుకుంటున్నారు. అప్పటి తమ ప్రభుత్వ వైఫల్యాలు బయటపడుతున్నాయి. ఏం మాట్లాడాలో తెలియక అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసి దొరికిపోతున్నారు. ప్రజలు నమ్మడం లేదు. సొంత కుటుంబం కూడా నమ్మడం లేదు. ఎన్ని పరిణామాలతో సినిమా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ అదే పనిగా సినిమా చూపిస్తాను అంటూ హెచ్చరించడం ద్వారా ప్రజల్లోనే పలుచన అవుతున్నారు. అధికారంలోకి వచ్చి సినిమా చూపిస్తానని చెప్పడం ద్వారా సమాజానికి ఆయన ఏం చూపిస్తున్నట్టు.. ఏం సంకేతాలు ఇస్తున్నట్టు?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version