Homeఆంధ్రప్రదేశ్‌Jagan Mohan Reddy : వైసీపీలో భారీ నియామకాలు.. 25 పార్లమెంటు స్థానాలకు కొత్త నేతలు!

Jagan Mohan Reddy : వైసీపీలో భారీ నియామకాలు.. 25 పార్లమెంటు స్థానాలకు కొత్త నేతలు!

Jagan Mohan Reddy : వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy )దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురయింది. వెనువెంటనే చాలామంది నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన చాలామంది నేతలు రాజీనామా ప్రకటించారు. అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యం పోగుచేసుకొని జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు అండగా నిలిచారు. వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో పార్టీలో భారీ ప్రక్షాళన చేస్తున్నారు. ముఖ్యంగా రాజీనామా బాట పట్టిన నేతలు స్థానంలో కొత్తవారిని నియమిస్తున్నారు.

* నేతల రాజీనామాతో..
దాదాపు జగన్ మంత్రివర్గంలో ఉన్న వారంతా వాటిని చవిచూశారు. అందులో చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయి రెడ్డి( Vijaya Sai Reddy) లాంటి నేతలు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి పార్టీలో ప్రక్షాళన తీసుకొచ్చారు. వారి స్థానంలో కొత్త నేతలకు బాధ్యతలు అప్పగించారు. జగన్ 1.0 ప్రజల కోసమని.. కానీ 2.0 మాత్రం కార్యకర్తల కోసమేనని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అదే సమయంలో జిల్లాల పర్యటనకు కూడా సిద్ధపడుతున్నారు. అయితే భారీ ఓటమి నుంచి తేరుకొని జగన్మోహన్ రెడ్డి పోరుబాట పట్టడం మాత్రం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది.

Also Read : తల్లికి వందనం’ పై బిగ్ అప్డేట్.. వారికి కోత తప్పదా?

* పార్టీ పునర్నిర్మాణం పై ఫోకస్..
ఒకవైపు కూటమి వైఫల్యాలను ఎండగడుతూనే పార్టీ పునర్నిర్మానంపై దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు( parliamentary constituitions ) కొత్త పరిశీలకులను నియమించారు. ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, విజయనగరం జిల్లాకు కిల్లి సత్యనారాయణ, అరకు బొడ్డేటి ప్రసాద్, అనకాపల్లి కి మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, విశాఖకు మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు, కాకినాడకు మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, అమలాపురానికి జక్కంపూడి విజయలక్ష్మి, రాజమండ్రి కి తిప్పల గురుమూర్తి రెడ్డిని నియమించారు.

* సీనియర్లకు చోటు నరసాపురం( narasapuram ) పార్లమెంట్ స్థానానికి ముదునూరి మురళీ కృష్ణంరాజు, ఏలూరుకు ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, మచిలీపట్నానికి జెట్టి గురునాథం, విజయవాడకు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరుకు పోతిన మహేష్, నరసరావుపేటకు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి, బాపట్ల కు ఎమ్మెల్సీ టూమాటి మాధవరావు, ఒంగోలుకు బత్తుల బ్రహ్మానందరెడ్డి లను నియమించారు. నెల్లూరుకు మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి, తిరుపతికి ఎంపీ మేడా రఘునాథరెడ్డి, చిత్తూరుకు చవ్వా రాజశేఖర్ రెడ్డి, రాజంపేటకు కొత్తమద్ది సురేష్ బాబు, కడపకు కొండూరు అజయ్ రెడ్డి, అనంతపురానికి మాజీ ఎమ్మెల్సీ బోరెడ్డి నరేష్ కుమార్ రెడ్డి, హిందూపురానికి ఆర్ రమేష్ రెడ్డి, నంద్యాలకు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, కర్నూలుకు మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డిని నియమిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రత్యేక ప్రకటన జారీ చేసింది.

Also Read : జగన్ హత్యకు ప్లాన్.. మాజీ ఐపీఎస్ సూత్రధారి.. ఆప్తుడి సంచలనం!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version