Jagan Mohan Reddy: పోయిన చోట వెతుక్కోవాలని జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) భావిస్తున్నారా? తనకు నష్టం జరిగిన చోట నివారణ చర్యలు ప్రారంభించారా? రాయలసీమ పై ఫోకస్ పెట్టారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఆయన సత్య సాయి పుట్టపర్తి జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు లో అడుగుపెట్టనున్నారు. దీంతో మరోసారి రాయలసీమ వేడెక్కే అవకాశం ఉంది. ఆ నియోజకవర్గ పరిధిలోని రామగిరి మండలం పాపిరెడ్డి పల్లికి చెందిన కురుబా లింగమయ్య ఇటీవల దారుణ హత్యకు గురయ్యారు. టిడిపి వర్గీయుల ఆయనను హత్య చేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాజకీయ కక్షలే దీనికి కారణం అంటున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి రాప్తాడు వస్తుండడం సంచలనంగా మారుతోంది.
Also Read: వైసీపీ ఎంపీ క్రాస్ ఓటింగ్.. వక్ఫ్ బిల్లులో కీలక పరిణామం!
* ఉగాది రోజు హత్య
ఉగాదినాడు ఆలయానికి వెళ్లి వస్తున్న లింగమయ్యను( lingamayya ) ప్రత్యర్ధులు దారి కాచి దారుణంగా హత్య చేశారు. అయితే ఇది తెలుగుదేశం పార్టీ వర్గీయులు చేసిన పనిగా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. త్వరలో తాను వస్తానని వారికి భరోసా ఇచ్చారు. అది మొదలు రాప్తాడులో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీనిపై ఎమ్మెల్యే పరిటాల సునీత స్పందించారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు బలి అయింది పరిటాల, గంగుల కుటుంబాలేనని ఆవేదన వ్యక్తం చేశారు. పరిటాల రవి హత్య వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి సైతం స్పందించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నడుమ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఈనెల 8న ఖరారు కావడం విశేషం.
* షెడ్యూల్ ఖరారు..
అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పోలీసులు అనుమతిస్తారా? లేదా? అన్నది చూడాలి. ఈరోజు మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి పర్యటన వివరాలను ప్రకటించారు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి( Prakash Reddy). వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 8న జగన్మోహన్ రెడ్డి రాప్తాడు కు వస్తున్నారని.. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారని చెప్పారు. అయితే లింగమయ్య అత్య తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మళ్లీ ఫ్యాక్షన్ తరహా ఘటనలు బయటపడ్డాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ప్రభుత్వం అనుమతిస్తుందా? లేదా? అన్నది చూడాలి.